Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరీ: ర‌కుల్ స్ట‌న్నింగ్ లుక్..షేకింగ్ త‌ప్ప‌దు!

By:  Tupaki Desk   |   18 March 2022 4:30 AM GMT
ఫోటో స్టోరీ: ర‌కుల్ స్ట‌న్నింగ్ లుక్..షేకింగ్ త‌ప్ప‌దు!
X
ఢిల్లీ బ్యూటీ ర‌కుల్ ప్రీత్ సింగ్ టెంప్టింగ్ ఎలివేష‌న్స్ ఏ రేంజ్ లో ఉంటాయో చెప్పాల్సిన ప‌నిలేదు. త‌న‌దైన గ్లామ్ షో తో ఇన్ స్టాని హీటెక్కించ‌డం బ్యూటీలో మ‌రో ప్ర‌త్యేక‌త‌. డిజైన‌ర్ వేర్స్ తో పాటు..అవ‌స‌రం మేర హ‌ద్దులు మీరిన దుస్తుల్లో కాక‌లు రేపుతుంది. తాజాగా బ్యూటీ స్ట‌న్నింగ్ లుక్ లో ఆక‌ట్టుకుంటుంది. నాచు రంగు బ్యాక్ డ్రాప్ లో థై అందాల్ని ఎలివేట్ చేస్తూ ధ‌రించిన స్క‌ర్ట్..టాప్ లో స్కిన్ టైట్ మ్యాచింగ్ ధ‌రించింది. ఆపైన మొత్తం బాడీని క‌వ‌ర్ చేస్తూ మ్యాచింగ్ కోట్ ధ‌రించి వివిధ భంగిమ‌ల్లో కెమెరాకి ఫోజులిచ్చింది.

క్లోజ్ అప్ షాట్ ల్ క్యూట్ స్మైల్ ర‌కుల్ ని మ‌రింత అందంగా ఎలివేట్ చేస్తోంది. పెద‌వుల‌కు లైట్ గా లిప్ స్టిక్..ఐబ్రోస్ కింద క‌నురెప్ప‌ల్ని హైలైట్ చేస్తూ అదే బ్రాండ్ పూసుకుంది. ఈ ఫోటోల్ని ర‌కుల్ ట్విట‌ర్లో షేర్ చేసింది. ఇప్పుడా ఫోటోలు నెట్టింట వైర‌ల్ గా మారాయి. అభిమానులు బ్యూటీ స్ట‌న్నింగ్ లు క్ పై హాట్ కామెంట్లు గుప్పిస్తున్నారు. డిజైన‌ర్ దుస్తుల్లో ర‌కుల్ స‌మ్ థింగ్ స్పెష‌ల్ గా ఫోక‌స్ అవుతుంది.

ఇక ర‌కుల్ సినిమాల విష‌యానికి వ‌స్తే బాలీవుడ్ లో న‌టిగా బిజీగా ఉంది. `డాక్ట‌ర్ జీ` అనే సినిమాలో న‌టిస్తోంది. చిత్రీక‌ర‌ణ పూర్త‌యింది. త్వ‌ర‌లోనే రిలీజ్ కానుంది. అలాగే `ఛ‌త్ర‌వాలీ` అనే మ‌రో సినిమాలో కూడా న‌టిస్తోంది. ఇది షూటింగ్ ద‌శ‌లో ఉంది. `ఎటాక్`..`ర‌న్ వే`..`థాంక్ గాడ్`..`మిష‌న్ సిండ్రాల్లా న‌టిస్తోంది`. వీటిలో కొన్ని చిత్రాలు షూటింగ్ పూర్తిచేసుకుని పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల్లో ఉన్నాయి.

ఇక కోలీవుడ్ లో శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న `ఇండియ‌న్ -2`లో న‌టిస్తోంది. ఈ సినిమాపై ర‌కుల్ చాలా ఆశ‌లు పెట్టుకుంది. తెలుగులో `31 అక్టోబ‌ర్ లేడీస నైట్` లో న‌టిస్తోంది. ఈ చిత్రాన్ని తెలుగు..త‌మిళ్ లో తెర‌కెక్కిస్తున్నారు. టాలీవుడ్ లో పాన్ ఇండియా చిత్రాల్లో అవ‌కాశాలు ఇవ్వాల‌ని ఆమ‌ధ్య‌ బ‌హిరంగానే కోరిన సంగ‌తి తెలిసిందే.