Begin typing your search above and press return to search.

'ఆ' బ్రేక్ వీళ్లకు చాలా ముఖ్యం సుమీ

By:  Tupaki Desk   |   3 Feb 2018 4:30 AM GMT
ఆ బ్రేక్ వీళ్లకు చాలా ముఖ్యం సుమీ
X
నాని నిర్మాతగా తెరకెక్కిన మూవీ అ!. ఈ చిత్రంపై అంచనాల సంగతి పక్కన పెడితే.. నటీనటుల పేర్ల లిస్ట్ చూస్తేనే ఆసక్తి కలుగుతోంది. ఇంతమంది స్టార్స్ ను పెట్టారు కదా అని భారీ బడ్జెట్ అనుకునేందుకు లేదు. మీడియం బడ్జెట్ కంటే కొంచెం తక్కువకే అయిందని టాక్. ఆ సంగతలా ఉంచితే.. అ! చిత్రం సక్సెస్ సాధిస్తే ఎవరికి బెనిఫిట్ అనే సంగతి ఆలోచిద్దాం.

టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్.. ట్యాలెంటెడ్ మలయాళీ బ్యూటీ నిత్యామీనన్ లకు సినిమా ఛాన్సులు బాగానే ఉన్నాయి. ఈ చిత్రంతో వారు పెద్దగా గెయిన్ అయేది పోగొట్టేకునేది ఏమీ ఉండక పోవచ్చు. ఇక మన న్యాచురల్ స్టార్ విషయానికి వస్తే.. ఫుల్ ఫాంలో ఉన్న నాని జస్ట్ వాయిస్ ఇచ్చాడంతే. ఈ మూవీ సక్సెస్ అయితే లాభాలొస్తాయి.. తేడా వస్తే నిర్మాతగా ఓ అనుభవం వస్తుందంతే. చెట్టుకు వాయిస్ ఓవర్ ఇచ్చిన రవితేజకు కూడా అ! చిత్రంతో ఒరిగేదేమీ ఉండదు. మర్యాద రామన్నలో సైకిల్ కి డబ్బింగ్ చెప్పి ఆకట్టుకున్న మాదిరిగా.. తన వాయిస్ తో కాసింత మ్యాజిక్ చేస్తాడు.

కానీ.. ఈ చిత్రం ఓ ఇద్దరు భామలకు కీలకం. కొత్త అవకాశాల కోసం తిప్పలు పడుతున్న రెజీనా కసాండ్రా.. డిఫరెంట్ గెటప్ తో విభిన్నమైన క్యారెక్టర్ కోసం బాగానే కష్టపడింది. అయితే నక్షత్రం సినిమాతో మ్యాగ్జిమం గ్లామర్ దారబోసినా ఈమెకు తెలుగులో బ్రేక్ రాలేదు. ఇక మరో పాత్రలో కనిపించనున్న తెలుగు బేబీ ఈషా రెబ్బా కూడా అ! పై ఆశలు పెట్టుకుంది. ఇప్పటివరకూ అరడజన్ తెలుగు సినిమాలు చేసిందనే పేరే కానీ.. సక్సెస్ రుచి మాత్రం ఇంకా ఈ భామకు తెలియలేదు. ఆ మధ్యన ఆమీతూమీ హిట్టయినా పెద్దగా ఈమెకు ఆఫర్లు వచ్చిందే లేదు. సో వీళ్ళిద్దరికీ 'ఆ' బ్రేక్ కీలకం సుమీ. చూద్దాం ఎలా ఆకట్టుకుంటారో!!