Begin typing your search above and press return to search.

అజ్ఞాతవాసికంటే గంట ముందు..

By:  Tupaki Desk   |   3 Jan 2018 10:27 PM IST
అజ్ఞాతవాసికంటే గంట ముందు..
X
అసలు సినిమాల రిలీజ్ సీజన్లో.. మనోళ్లు టీజర్లు ట్రైలర్లు అంటూ చితక్కొట్టేస్తున్నారు. ఒకప్పుడు త్వరలో రిలీజ్ అయ్యే సినిమాల తాలూకు టీజర్లను మాత్రం ఎక్కువగా రిలీజ్ చేశారు. కాని ఇప్పుడు మాత్రం సంవత్సరం తరువాత వచ్చే సినిమాలకు కూడా ఇప్పుడే టీజర్లు వదులుతున్నారు. అలాగే రిలీజ్ తేదీ ఖరారు కాని సినిమాల టీజర్లు కూడా వచ్చేస్తున్నాయి.

ఇప్పుడిక అసలు విషయంలోకి వెళితే.. ఫిబ్రవరి మొదటి వారంలో వద్దామని అనుకుంటన్న హీరో నాని డెబ్యూ ప్రొడక్షన్ 'ఆ!' సినిమా టీజర్ కూడా ఇప్పుడు టీజర్ల రేసులోకి దూకుతోంది. రేపు సాయంత్రం 6 గంటలకు ఆల్రెడీ పవన్ కళ్యాణ్‌ అజ్ఞాతవాసి సినిమా టీజర్ వస్తుందనే న్యూస్ సినిమా లవ్వర్లను ఊరిస్తున్న వేళ.. ఓ గంట ముందు.. అంటే ఐదు గంటలకు 'ఆ' సినిమా టీజర్ ను రిలీజ్ చేస్తున్నట్లు నాని అండ్ కో ప్రకటించారు. ఇప్పటివరకు క్యారక్టర్ల తాలూకు ఫస్ట్ లుక్ పోస్టర్లతో ఇంప్రెస్ చేసిన ఈ ఆ టీమ్.. ఇప్పుడు టీజర్ తో ఆకట్టుకుంటాం అంటున్నారు.

నాని ఒక చేపగా.. రవితేజ ఒక చెట్టుగా వాయిస్ ఓవర్ ఇస్తున్న ఈ సినిమాలో.. నిత్యా మీనన్.. ఈషా.. కాజల్.. శ్రీనివాస్ అవసరాల.. ప్రియదర్శి.. ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. మొత్తానికి న్యూ ఇయర్ రాగానే మన సినిమాల్లో ఎక్కడలేని స్పీడు వచ్చేసింది కదూ. ప్రమోషన్లతో దంచేస్తున్నారు.