Begin typing your search above and press return to search.

అవార్డుల ఫంక్షన్లలో 'మెగా' భజన!!

By:  Tupaki Desk   |   8 Jun 2016 11:00 PM IST
అవార్డుల ఫంక్షన్లలో మెగా భజన!!
X
సదరు మ్యాగజైన్ ఎడిటర్‌ కు బాగా క్లోజ్‌ గా ఉండేవారికి.. అలాగే సదరు అవార్డుల సంస్థతో మాంచి అనుబంధం ఉన్నవారికే అవార్డులు ఇస్తారా అంటే.. అవుననే చెప్పాలి. అంతెందుకు.. తమ మ్యాగజైన్ కోసం ఎప్పుడూ ఏదో ఒక ఫోటోషూట్‌ చేసే అమ్మాయిని తెలుగులో బెస్ట్ సపోర్టింగ్‌ యాక్ట్రెస్ అంటూ నామినేట్ చేసింది ప్రెస్టీజియస్ అవార్డులు ఇచ్చే ఓ సంస్థ. ఇక మరో సంస్థ అయితే.. తమ కంపెనీలు పెట్టుబడులు పెట్టిన రూలింగ్ పార్టీవారికి ఇతగాడు వ్యతిరేకి కాబట్టి.. అతన్ని బెస్ట్ యాక్టర్ గా నామినేట్ చేయలేదు. ఇలాంటి రాజకీయాలు మధ్యన.. చాలా అవార్డుల ఆర్జనైజర్లు 'మెగా' భజన చేస్తున్నారు తెలుసా?

తెలుగు ఫిలిం ఇండస్ర్టీలో నడిచే ఒక టాక్‌ ఏంటంటే.. ఇక్కడ జరిగే ఎలాంటి అవార్డుల ఫంక్షన్‌ అయినా కూడా ఖచ్చితంగా 'మెగా' ఫ్యామిలీ నుండి సపోర్టు కోరుకుంటోందట. దానికి కారణం ఆ ఫ్యామిలీ నుండి ఏకంగా అరడజనుకు పైగా హీరోలు ఉండటమే. మొన్ననే ఐఫా అవార్డుల వారు.. చిరంజీవి సలహా మేరకు హైదరాబాద్‌ రావడమే కాదు.. ఆ తొలి ఫంక్షన్‌ లో చరణ్‌ తో స్పెషల్‌ డ్యాన్స్ అండ్ అల్లు శిరీష్‌ తో హోస్టింగ్ చేయించారు. ఇప్పుడు ఫిలిం ఫేర్‌ అవార్డుల విషయంలో కూడా ఇలాగే జరుగుతోంది. ఏకంగా బెస్ట్ యాక్టర్ అండ్ సపోర్టింగ్‌ యాక్టర్‌ అంటూ బన్నీని రెండు అవార్డులకు నామినేట్‌ చేశారు. నామినేషన్‌ నిజమే కావొచ్చు.. కాకపోతే ఇదంతా మెగా ఎట్రాక్షన్‌ కోసమే అని విమర్శలు వినిపిస్తున్నాయి.

మరో ఛానల్‌ 'మా' వారు అయితే.. ఎలాగో చిరంజీవికి పార్టనర్షిప్‌ కూడా ఉంది కాబట్టి.. ఆయన కోసం ఒక ప్రత్యేక మెడ్లీ చేయిస్తున్నారు. ఓ ఇద్దరు మెగా హీరోలు ఆ పాటలకు డ్యాన్సులు వేయిస్తున్నారు. సడన్‌ గా ఈ రేంజు 'మెగా' భజన చేస్తుంటే ఎవరైనా షాక్‌ తినాల్సిందే.