Begin typing your search above and press return to search.

వీరసింహారెడ్డి తో ఢీ కొట్టబోతున్న కేజీఎఫ్‌ స్టార్‌..!

By:  Tupaki Desk   |   14 Nov 2022 6:44 AM GMT
వీరసింహారెడ్డి తో ఢీ కొట్టబోతున్న కేజీఎఫ్‌ స్టార్‌..!
X
నందమూరి బాలకృష్ణ అఖండ సినిమా తర్వాత చేస్తున్న సినిమా వీర సింహారెడ్డి. ఈ సినిమాకు క్రాక్ దర్శకుడు గోపీచంద్‌ మలినేని దర్శకత్వం వహిస్తున్నాడు. అఖండ మరియు క్రాక్ సినిమా లు మంచి విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో ఆ సినిమాల యొక్క స్టార్స్ కలిసి చేస్తున్న వీర సింహా రెడ్డి భారీ విజయాన్ని సొంతం చేసుకోవడం ఖాయం అనే నమ్మకంతో నందమూరి అభిమానులు ఉన్నారు.

ఇప్పటికే విడుదల అయిన బాలయ్య లుక్ మరియు టీజర్ ఇతర ప్రమోషనల్‌ స్టఫ్‌ సినిమా పై అంచనాలు ఆకాశమే హద్దు అన్నట్లుగా పెంచే విధంగా ఉంది అంటూ కామెంట్స్ వస్తున్నాయి. ఈ సమయంలో ఈ సినిమా లో కేజీఎఫ్ 2 లో నటించి మంచి పేరు దక్కించుకున్న స్టార్‌ అవినాష్ నటిస్తున్నట్లుగా వచ్చిన వార్త సినిమా పై మరింతగా ఆసక్తిని పెంచుతోంది.

కేజీఎఫ్ 2 లో ఆండ్రూస్ పాత్రలో నటించిన అవినాష్ ఇప్పుడు అంతకు మించి అన్నట్లుగా వీర సింహారెడ్డి సినిమాలో కనిపించబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.

తాజాగా దర్శకుడు గోపీచంద్‌ మలినేనితో కలిసి ఉన్న ఫోటోను అవినాష్ షేర్‌ చేయడం జరిగింది. సినిమా తప్పకుండా అద్భుతంగా ఉంటుందనే నమ్మకం ను ఆయన వ్యక్తం చేశాడు.

ఈ సినిమాలో అవినాష్ నెగటివ్‌ పాత్రలో కనిపించబోతున్నాడు అనేది సమాచారం. ఇక ఈ సినిమాకు సంబంధించిన విడుదల తేదీని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. సంక్రాంతిని బాలయ్య ఈ సినిమా తో బాక్సాఫీస్ ను షేక్‌ చేసేందుకు సిద్ధం అవుతున్నాడు. అఖండ సక్సెస్ నేపథ్యంలో ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది.

మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మించిన ఈ సినిమా సంక్రాంతికి భారీ ఎత్తున విడుదల అవ్వడంతో పాటు అఖండ సినిమా సాధించిన వసూళ్లను మించి వసూళ్లు సాధిస్తుందని అంటున్నారు. కేజీఎఫ్ స్టార్‌ అవినాష్ ఈ సినిమా లో నటించడం వల్ల అంచనాలు మరింతగా పెరిగాయి అనేది సమాచారం.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.