Begin typing your search above and press return to search.

‘చిన్నారి పెళ్లి కూతురు’.. అత‌న్ని పెళ్లి చేసుకుందా?

By:  Tupaki Desk   |   29 March 2021 8:00 AM IST
‘చిన్నారి పెళ్లి కూతురు’.. అత‌న్ని పెళ్లి చేసుకుందా?
X
‘అవికాగోర్..’ చాలా మందికి తెలియదు. కానీ.. చిన్నారి పెళ్లికూతురు అంటే మాత్రం ఠక్కున గుర్తు పట్టేస్తారు. అంతలా టీవీ ప్రేక్షకుల మనసులో స్థానం సంపాదించుకుంది అవికా గోర్. ఆ తర్వాత నటిగానూ తానేంటో నిరూపించుకుంది. ‘ఉయ్యాల జంపాల’, ‘సినిమా చూపిస్త మావా’, ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ వంటి చిత్రాలతో తనదైన గుర్తింపు తెచ్చుకుంది అవికాగోర్.

అయితే.. ఈ బ్యూటీ రోడీస్‌-17 కంటిస్టెంట్ మిలింద్ చంద్వానీతో పీక‌ల్లోతు ప్రేమ‌లో ఉన్న సంగ‌తి తెలిసిందే. ఈ విష‌యాన్ని గ‌తేడాది అవికానే అధికారికంగా ప్ర‌క‌టించింది. కానీ.. తాజాగా సోషల్ మీడియాలో ఓ ఫొటో షేర్ చేసింది అవికా గోర్‌. అందులో నటుడు ఆదిల్ ఖాన్ ను ఆమె చ‌ర్చిలో వివాహం చేసుకున్నట్టు క‌నిపించింది. దీంతో.. అవికా ఇత‌న్ని పెళ్లి చేసుకుందా? అని నెటిజ‌న్లు ఆశ్చ‌ర్యం వ్య‌క్తంచేశారు?

కానీ.. అస‌లు విష‌యం ఏమంటే.. కా‌దిల్ అనే ప్రైవేటు సాంగ్ షూట్లో వీళ్లిద్ద‌రూ క‌లిసి న‌టిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా తీసిన చిత్ర‌మే అది. ఈ విష‌యం ఆలస్యంగా తెలుసుకున్న వారు నాలుక క‌రుచుకుంటున్నారు. మొత్తానికి ఈ పిక్ ద్వారా కాదిల్ పాట‌కు మంచి ప్ర‌మోష‌న్ ద‌క్కిన‌ట్టైంది.