Begin typing your search above and press return to search.

ఉయ్యాల భామ ఇప్పుడెలా ఉందంటే

By:  Tupaki Desk   |   18 Nov 2017 4:27 PM IST
ఉయ్యాల భామ ఇప్పుడెలా ఉందంటే
X
చిన్నారి పెళ్లికూతురుగా దేశం మొత్తాన్ని ఆకట్టుకున్న అవికా గోర్.. ఉయ్యాల జంపాలా మూవీతో టాలీవుడ్ తెరంగేట్రం చేయడమే కాదు.. తెలుగు ప్రేక్షకుల మనసులు కొల్లగొట్టేసింది. ఆ తర్వాత వరుసగా తెలుగు సినిమాలలో నటించి.. సడెన్ గా బ్రేక్ ఇచ్చేసింది. అవిక ట్యాలెంట్ పై ఎవరికీ ఎలాంటి అనుమానాలు లేవు కానీ.. పర్సనాలిటీ విషయంలోనే కాసిన్ని విమర్శలు వచ్చాయి.

బొద్దు భామ కావడంతో.. గ్లామర్ హీరోయిన్ ఆఫర్స్ ఇచ్చే సాహసం ఎవరూ చేయలేదు. తనకు వస్తున్న కేరక్టర్స్ ప్రకారం.. తనను ఓ కేటగిరీకి జమ కట్టేస్తున్నారనే సంగతి పసిగట్టిన అవికా గోర్.. హఠాత్తుగా సినిమాలకు బ్రేక్ ఇచ్చేసి.. స్లిమ్ గా మారిపోయే పనిలో పడిపోయింది. ఈ రూట్ లో బాగానే సక్సెస్ అయింది కూడా. ప్రస్తుతం ఈమె లేటెస్ట్ ఫోటోలను చూస్తే ఎవరైనా షాక్ తినేయాల్సిందే. తన పర్సనాలిటీని బోలెడంత నాజుగ్గా మార్చేసుకుని రచ్చ చేసేస్తున్న అవికా గోర్.. కమర్షియల్ సినిమాల్లో నటించేందుకు తాను రెడీ అని ఇన్ డైరెక్టుగా చెప్పేస్తోంది.

తను పాల్గొంటున్న లాదో2 టీవీషోను ప్రమోట్ చేసుకోవడానికి రీసెంట్ గా హిందీ బిగ్ బాస్ 11లో కూడా గెస్ట్ గా కనిపించింది అవికా గోర్. ఇప్పటికే పలు తెలుగు.. హిందీ సినిమాల్లో ట్యాలెంట్ చూపించిన ఈ ఉయ్యాల జంపాల భామ.. త్వరలో తన గ్లామర్ ను కూడా చూపించేయడం ఖాయం అని ఫిక్స్ అయిపోవచ్చు.