Begin typing your search above and press return to search.

ఫ‌స్ట్ గ్లింప్స్: క‌ల‌ల రాణిలా క‌ల్లోలం రేపిన అవిక‌

By:  Tupaki Desk   |   30 Jun 2021 4:30 AM GMT
ఫ‌స్ట్ గ్లింప్స్: క‌ల‌ల రాణిలా క‌ల్లోలం రేపిన అవిక‌
X
టాలీవుడ్ లోకి ఒక వేవ్ లా వ‌చ్చిన న‌వ‌త‌రం బ్యూటీ అవికాగోర్. బాల‌న‌టిగానే అవార్డులు రివార్డులు అందుకున్న అవికా గోర్ ఆ త‌ర్వాత క‌థానాయిక‌గా తెరంగేట్రం చేసింది. ఆరంగేట్ర‌మే ఉయ్యాల జంపాల సినిమాతో బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకుని కెరీర్ జ‌ర్నీని సాఫీగానే ర‌న్ చేసింది.

అయితే ఇటీవ‌ల కొంత గ్యాప్ తీసుకుని తిరిగి టాలీవుడ్ లో ప్ర‌వేశిస్తున్న‌ ఈ బ్యూటీ రైట‌ర్ కం ద‌ర్శ‌కుడు శ్రీ‌ధ‌ర్ సీపాన తెర‌కెక్కిస్తున్న తాజా చిత్రంలో న‌టిస్తోంది. మెగా అల్లుడు క‌ళ్యాణ్ దేవ్ ఈ చిత్రంలో క‌థానాయ‌కుడు. GA2 పిక్చర్స్ స‌మ‌ర్ప‌ణ‌లో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ -అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. టి. జి. విశ్వ ప్రసాద్ -వివేక్ కుచిభోట్ల - అభిషేక్ అగర్వాల్ నిర్మాత‌లు. అనుప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. ప్ర‌స్తుతం చిత్రీక‌ర‌ణ‌ పురోగతిలో ఉంది.

నేడు అవికా గోర్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా ఫస్ట్ గ్లింప్స్ విడుద‌లైంది. వీడియో ఆద్యంతం అవిక బ్యూటిఫుల్ ఇంట్ర‌డ‌క్ష‌న్ కి యూత్ ఫిదా అవ్వాల్సిందే. అలా హాఫ్ షోల్డ‌ర్ ఎల్లో ఫ్రాకులో అవిక ముసిముసిగా న‌వ్వుతూ న‌డిచొస్తుంటే .. పింక్ ప‌రికిణీలో వాన వాన వ‌ల్ల‌ప్ప‌లా డ్యాన్సాడేస్తుంటే కుర్ర‌కారు గుండెల్లో గుబులు పుట్ట‌డం ఖాయం. క‌ల‌ల‌రాణిలా క‌ల్లోలం రేపిన అవిక ఈసారి ఆశించిన విజ‌యం అందుకుంటుంద‌నే ఆశిద్దాం. నేడు బర్త్ డే జ‌రుపుకుంటున్న అవికా గోర్ కి చిత్ర‌బృందం శుభాకాంక్ష‌లు తెలిపింది. ఈ చిత్రానికి ఆండ్రూ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. జునైద్ సిద్దిక్ ఎడిటర్.