Begin typing your search above and press return to search.

అవిక అందాలు.. అందుకోసమేనా?

By:  Tupaki Desk   |   16 Oct 2015 4:00 AM IST
అవిక అందాలు.. అందుకోసమేనా?
X
చిన్నారి పెళ్లి కూతురుకి ఓటు హక్కు ఓ మూడు నెలల క్రితం వచ్చిందంతే. ఇన్నాళ్లూ టీనేజ్ లో ఉన్న బుల్లితెర సుందరాంగికి.. మరో ఏడాది మాత్రమే టీనేజ్ గర్ల్ అనిపించుకునే ఛాన్స్ ఉంది. రెండేళ్ల క్రితమే సినీ రంగంలో ప్రవేశించినా.. ఇన్నాళ్లూ క్యూటీ కేరక్టర్లనే వేసింది. గ్లామర్ కు ఆమడ దూరంలో నిలిచింది. టీనేజ్ దాటకుండానే హీరోయిన్ లీగ్ లో పాగా వేసేందుకు ఎత్తులు వేస్తోంది అవిక.

ఉయ్యాల జంపాలా, సినిమా చూపిస్త మామ హిట్స్ తో టాలీవుడ్ లో ప్రామిసింగ్ హీరోయిన్ అనిపించుకుంది. ఇప్పుడు ఈ భామ టార్గెట్ నెక్ట్స్ లెవెల్ కి ఎదగాలి. హీరోయిన్ గా మరో మెట్టు ఎక్కాలన్నా, స్టార్ లీగ్ కి పోటీ ఇవ్వాలన్నా పెర్ఫామెన్స్ ఒకటే చాలదు.. గ్లామర్ కూడా అవసరమే. ఈ విషయం అవికకు బాగానే అర్ధమైంది ఇప్పుడు. అందుకే ఓ మోస్తరుగా డోస్ పెంచుతూ టీజ్ చేస్తోంది.

బబ్లీగా ఉండే ఈ బుల్లిభామ.. లంగాఓణీలతో మొదలు పెట్టి, ఇప్పుడు షార్ట్స్ లోకి దిగిపోయింది. అఫ్ కోర్స్ పైన నెట్టెడ్ బాటమ్ ధరించిందనుకోండి. అది కవరింగ్ కోసమే అని అర్ధమవుతోంది లెండి. గ్లామర్ ఒలకబోయడానికి రెడీ అని ఇన్ డైరెక్ట్ గా చెబుతూనే.. మళ్లీ కవరింగ్ చేసుకోవడం లాంటిదే ఇది కూడా. త్వరలో అవిక గోర్ నుంచి కూడా గ్లామరస్ రోల్స్ ఎక్స్ పెక్ట్ చేసేయచ్చు.