Begin typing your search above and press return to search.

ఇన్ సైడ్ టాక్: రెండో సినిమాకు యావరేజ్ రెస్పాన్స్!

By:  Tupaki Desk   |   22 April 2020 6:00 AM IST
ఇన్ సైడ్ టాక్:  రెండో సినిమాకు యావరేజ్ రెస్పాన్స్!
X
అతనో యువ దర్శకుడు. 2018 ద్వితీయార్థంలో ఆయన డెబ్యూ సినిమా విడుదలైంది. చిన్న బడ్జెట్ సినిమా పైగా వైజాగ్ నేపథ్యంలోతీసింది . అవార్డులు గట్రా తెచ్చుకునే టైపు సినిమా కావడంతో సినిమాకు పేరు మామూలుగా రాలేదు. అయితే అదంతా ఏ సెక్షన్ ఆడియన్స్ వరకే పరిమితం లెండి. కింద సెంటర్లలో ఆ సినిమా పెద్దగా రిలీజ్ కాలేదు. అయినా కూడా మాస్ ఆడియన్స్ చూడరనేది వాస్తవం. ఈ సినిమా తర్వాత ఓ బడా బడా బ్లాక్ బస్టర్ తీసిన బ్యానర్ నుండి రెండో సినిమా ఆఫర్ వచ్చింది.

ఆ సినిమా షూటింగ్ పూర్తయింది.. అంతా సవ్యంగా జరిగి ఉంటే సినిమా ఏప్రిల్ లోనే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. అయితే కరోనా క్రైసిస్ కారణంగా ఈ సినిమా విడుదల ప్రస్తుతం వాయిదా పడింది. ఇదిలా ఉంటే ఈ మధ్యే ఈ సినిమాను ఓ ప్యాన్ ఇండియా బ్లాక్ బస్టర్ సినిమాకు పనిచేసిన టీమ్ సభ్యులకు చూపిస్తే మిశ్రమ స్పందనే లభించిందట. ఈ దర్శకుడు తీసిన తొలి సినిమాలో కొత్త నటులను తీసుకున్న కారణం వల్ల సినిమాకు ప్లస్ అయ్యారని.. ఇప్పుడు ఈ సినిమా కథ కూడా ఒక లోకల్ఏరియా కు సంబంధించిన కథ కావడంతో అలానే లోకల్ నటులను తీసుకుంటే ప్లస్ అయ్యేవారని.. నేటివిటీ కనిపించేదని అభిప్రాయపడ్డారట.

అంతే కాకుండా మరికొన్ని విషయాల్లో డైరెక్టర్ కు సలహాలు ఇచ్చారట. ఈ సినిమాలో బాగా అతిగా అనిపించిన క్యారెక్టర్ హీరోదేనని నిర్మొహమాటంగా చెప్పారట. అంతే కాకుండా కొన్ని సీన్లను ట్రిమ్ చేయాలని కూడా సూచించారట. సన్నిహితులు.. ఇంటర్నల్ టీమ్ వారే ఇన్నిన్ని సలహాలు ఇస్తే ఇక ఈ సినిమాను విడుదల తర్వాత చూడబోయేవారు ఎన్ని సలహాలు ఇస్తారో చూడాలి అని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే అసలు ఈ సినిమాకు థియేటర్లు ఇస్తారా అనేది చర్చనీయాంశంగా మారింది. ఈ దర్శకుడి మొదటి సినిమాకు ఓ ప్రముఖ బ్యానర్ దన్నుగా నిలిచింది. ఈ సినిమా రిలీజుకూ వారే వెనక ఉంటారట. అయితే థియేటర్లకు జనాలు వస్తారో రారో అని సందిగ్ధం నెలకొన్న పరిస్థితుల్లో ఇలాంటి ప్రయోగాత్మకమైన సినిమాకు స్లాట్ దొరుకుతుందా లేదా అనేది చూడాలి.