Begin typing your search above and press return to search.

ట్రైలర్ టాక్: ముగియనున్న సూపర్ హీరోస్ కథ

By:  Tupaki Desk   |   8 Dec 2018 4:57 AM GMT
ట్రైలర్ టాక్: ముగియనున్న సూపర్ హీరోస్ కథ
X
ప్రపంచవ్యాప్తంగా అశేష అభిమానులను సంపాదించుకున్న అవెంజర్స్ సిరీస్ ముగింపుకు వచ్చేసింది. గత ఏడాది వచ్చిన అవెంజర్స్ ఇన్ ఫినిటి వార్ ఇండియాలో రికార్డుల దుమ్ము దులిపింది. మన సౌత్ లో కూడా భారీ వసూళ్లను కొల్లగొట్టింది. ఒకే సినిమాలో హాలీవుడ్ క్రేజీ సూపర్ హీరో క్యారెక్టర్స్ అన్ని ఇందులో ఉండటమే ఇంత హైప్ కి కారణం. ఇప్పుడు ఎండ్ గేమ్ పేరుతో అవెంజర్స్ చివరి సినిమా వచ్చే ఏడాది వేసవిలో రాబోతోంది. ఈ సందర్భంగా విడుదల చేసిన ట్రైలర్ సంచలనం రేపుతోంది.

మార్వేల్ సంస్థ దీన్ని ఈ ఫ్రాంచైజీలో చివరి సినిమాగా పేర్కొనడంతో ప్రేక్షకులు ఎమోషనల్ గా ఫీలవుతున్నారు. ఇన్ ఫినిటి వార్ లో విలన్ తానోస్ చేతిలో కొందరు చనిపోయారు. స్పైడర్ మ్యాన్ బ్లాంక్ పాంథర్ లాంటి పాత్రలు తానోస్ బలం ముందు నిలవలేక ప్రాణాలు కోల్పోయారు. ఆ సినిమా క్లైమాక్స్ లో తానోస్ ఇంకా బలవంతుడిగా మారి జీవించి ఉన్నట్టే చూపిస్తారు. ఇప్పుడీ ఎండ్ గేమ్ లో తానోస్ ఇంకా బ్రతికే ఉన్న ఐరన్ మ్యాన్ హల్క్ డాక్టర్ స్ట్రేంజ్ కెప్టెన్ అమెరికా లాంటి వాళ్ళ చేతుల్లో ఎలా హతమవబోతున్నాడో ఆసక్తి కరంగా మారింది.

తానోస్ ఎంత దుర్మార్గుడైనా అతన్ని ఇష్టపడిన అభిమానులు కొట్లలో ఉన్నారు. సో అతని పతనం కూడా ఇంత ఆసక్తి రేగడానికి కారణం అవుతోంది. ఎప్పటిలాగే విజువల్ ఎఫెక్ట్స్ అదరహో అనే రేంజ్ లో ఉండగా ఈ ఎండ్ గేమ్ ని అన్నిటిని మించే స్థాయిలో ఉంటుందని అందరు ఎదురు చూస్తున్నారు. ఏప్రిల్ చివరి వారంలో విడుదల కానున్న ఎండ్ గేమ్ భారతీయ ప్రేక్షకులను మాత్రం వారం రోజులు ముందుగానే పలకరించనుంది. సో సూపర్ హీరోస్ అల్టిమేట్ వార్ చూసేందుకు ఇంకో ఐదు నెలలు ఓపిక పట్టాలి.