Begin typing your search above and press return to search.

షాకింగ్: అవెంజ‌ర్స్ స్టార్ల‌ పారితోషికాలు

By:  Tupaki Desk   |   2 May 2019 5:30 PM GMT
షాకింగ్: అవెంజ‌ర్స్ స్టార్ల‌ పారితోషికాలు
X
ప్ర‌పంచ‌వ్యాప్తంగా అవెంజ‌ర్స్ - ఎండ్ గేమ్ బాక్సాఫీస్ సంచ‌ల‌నాల గురించి తెలిసిందే. ఈ సినిమా ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న అన్ని రికార్డుల్ని చెరిపేస్తూ 2 బిలియ‌న్ డాల‌ర్ వ‌సూళ్ల‌ను సాధిస్తుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. దాదాపు 8381 కోట్ల బ‌డ్జెట్ తో ఈ చిత్రం తెర‌కెక్కింది. ఇప్ప‌టికే 10,400 కోట్లు (1.5 బిలియ‌న్ డాల‌ర్) వ‌సూళ్ల రికార్డును ఈ చిత్రం న‌మోదు చేసింద‌ని తెలుస్తోంది. అయితే ఈ స్థాయిలో సంచ‌ల‌నాలు సృష్టిస్తున్న ఈ సినిమాలో న‌టించిన తార‌ల పారితోషికాల మ్యాట‌ర్ ఏమిటో? మార్వ‌ల్ సంస్థ నుంచి ఏఏ హీరో ఎంత పారితోషికం అందుకున్నారో తెలుసా?

ఈ సినిమాకి ఫేస్ ఆఫ్ ది హీరోగా రాబ‌ర్ట్ డౌనీ జూనియ‌ర్ పేరు మార్మోగుతోంది. అత‌డి న‌ట‌న‌.. ఆహార్య ంలో ప‌లికించిన ఎమోష‌న్ సినిమా ఘ‌న‌విజ‌యంలో కీల‌క పాత్ర పోషించింద‌ని క్రిటిక్స్ పొగ‌డ్త‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. ఐర‌న్ మ్యాన్ గా అత్య ంత ప్ర‌భావ‌వంత‌మైన సూప‌ర్ హీరోగా రాబ‌ర్ట్ న‌టించార‌ని ప్ర‌శంసించారు. రాబ‌ర్ట్ గతంలో ఇన్ ఫినిటీ వార్ (అవెంజ‌ర్స్ 3) కోసం 521 కోట్లు (75 మిలియ‌న్ డాల‌ర్లు) అందుకున్నాడు. ఇన్ ఫినిటీ వార్ కి కొన‌సాగింపుగా వ‌చ్చిన ఎండ్ గేమ్ లో అత‌డి కామిక్ టైమింగ్.. ఎమోష‌న‌ల్ పెర్ఫామెన్స్ అభిమానుల గుండెల్ని ట‌చ్ చేసింద‌న్న ప్ర‌శంస ద‌క్కింది. ఇక ఈ ఫ్రాంఛైజీలోనే నంబ‌ర్ -1 పారితోషికం అందుకున్న హీరోగా అత‌డు పాపుల‌ర‌య్యాడు. అత‌డికి అవెంజర్ సిరీస్‌ల ద్వారా ఇత‌ర‌త్రా మార్గాల్లోనూ ప్రతిఫలాన్ని పొందే హక్కులను సొంతం చేసుకొన్నారని తెలుస్తోంది. అంటే 521 కోట్ల‌ను మించి అత‌డు ఈ సినిమాలో న‌టించినందుకు అందుకుంటున్నాడ‌న్న‌మాట‌.

అయితే రాబ‌ర్ట్ డౌనీ జూనియ‌ర్ .. ఇంత‌కుముందు స్పైడర్ మ్యాన్ హోం కమింగ్ సినిమా కోసం రోజుకు 35 కోట్లు (5 మిలియ‌న్ డాల‌ర్లు ) చొప్పున అందుకునే వాడ‌ట‌. ఆ సినిమా కోసం వారానికి మూడు రోజులు మాత్ర‌మే ఆయ‌న‌ ప‌ని చేసేవార‌ట‌. ఇక ఐరన్ మ్యాన్ సంచ‌ల‌నాల తర్వాత ప్రతీ సినిమాకు 139 కోట్ల ( 20 మిలియన్ డాలర్లు) పారితోషికం అందుకొనే అతికొద్ది మంది హాలీవుడ్ హీరోలలో ఒకడిగా రికార్డుల‌కెక్కారు.

రాబ‌ర్ట్ డౌనీ త‌ర్వాత అత‌డికి ద‌రిదాపుల్లో పారితోషికాలు లేక‌పోయిన క‌ళ్లు చెదిరే పారితోషికాలు ఎవ‌రెవరికి ద‌క్కాయి అంటే.. స్కార్లెట్ జాన్స‌న్.. క్రిస్ హేమ్స్‌ వర్త్.. క్రిస్ ఇవాన్స్ పేర్లు వినిపిస్తున్నాయి. స్కార్లెట్ జాన్సన్ ఇన్ఫినిటీ వార్‌ కోసం సుమారు 139 కోట్ల (20 మిలియన్ డాలర్లు) పారితోషికం అందుకున్నారు. క్రిస్ ఇవాన్స్ (కెప్టెన్ అమెరికా) .. క్రిష్ హేమ్స్ వ‌ర్త్ (థోర్) ఇన్ ఫినిటీ వార్ కోసం 20 మిలియ‌న్ డాల‌ర్లు అంటే 139 కోట్ల పారితోషికం రేంజ్ లో అందుకొన్నారు. ఎండ్ గేమ్ కి ఈ ముగ్గురూ అదే పారితోషికం అందుకున్నారు. ఎండ్ గేమ్ దాదాపు 46 దేశాల్లో విడుద‌లై అన్ని చోట్లా రికార్డుల మోత మోగిస్తోంది.