Begin typing your search above and press return to search.

వామ్మో అవెంజర్స్ కుమ్మేసిందిగా

By:  Tupaki Desk   |   8 May 2018 11:22 AM GMT
వామ్మో అవెంజర్స్ కుమ్మేసిందిగా
X
హాలీవుడ్ సూపర్ హీరోస్ మెగా మల్టీ స్టారర్ అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్ విడుదలకు ముందు ఇది ఇక్కడి సినిమాలపై ఎఫెక్ట్ చూపిస్తుందేమో అని అనుమానపడ్డ భయాలను నిజం చేస్తూ పది రోజులకే మొత్తం 250 కోట్లు వసూలు చేసి ఇండియాలో ఇప్పటి దాకా ఏ హాలీవుడ్ సినిమా సాధించని ఫీట్ చేసి చూపించింది. ఇప్పటి దాకా ఈ రికార్డు జంగిల్ బుక్ పేరు మీదే ఉంది.అది కూడా ఫుల్ రన్ కలిపి మొత్తం 245 కోట్లు వస్తే అవెంజర్స్ జస్ట్ 10 రోజుల్లోనే దూది పింజెలాగా దాన్ని ఊది పారేసింది. తెలుగుతో సహా వివిధ బాషలలో అనువదించడంతో పాటు అన్నింటికీ త్రీ డి సౌకర్యం కల్పించడంతో ప్రేక్షకులు దీనికి పోటెత్తారు. మొదటి వీక్ ఎండ్ కే వంద కోట్లు ఈజీగా దాటేసిన అవెంజర్స్ మరో పది రోజుల దాకా తన డ్రీం రన్ కంటిన్యూ చేయటం ఖాయంగా కనిపిస్తోంది. ముఖ్యంగా మల్టీ ప్లెక్స్ యజమానులు దీన్ని రీ ప్లేస్ చేసేందుకు ఇష్టపడకపోవడం గమనార్హం.

ఫైనల్ గా మూడు వందల మార్కు చేరుతుందా అంటే అదేమంత కష్టంగా అనిపించడం లేదు అంటోంది ట్రేడ్. ఎక్కడికక్కడ రీజనల్ మార్కెట్ లో వివిధ బాషా సినిమాలు కొత్తవి విడుదల అవుతున్నప్పటికీ అవెంజర్స్ క్రేజ్ అలాగే కొనసాగటం విశేషం. ఈ రేంజ్ హైప్ గతంలో అవతార్ కు మాత్రమే వచ్చింది అని చెప్పొచ్చు. ప్రసాద్ ఐమ్యాక్స్ లో ఏకంగా 100 రోజులకు పైగా నాలుగు ఆటలతో ప్రదర్శించి అప్పట్లోనే కొత్త రికార్డు సెట్ చేసింది. అవెంజర్స్ కొన్ని చోట్ల ఈ ఫీట్ కూడా సాధించేలా కనిపిస్తోంది. విలన్ తానోస్ ని చంపలేదు కాబట్టి తరువాయి భాగం ఉంటుంది అని హింట్ ఇచ్చేసినట్టే. కాకపోతే ఎంత లేదన్నా రెండు మూడేళ్ళు పడుతుంది లెండి. ఇక ఈ వారం చెప్పుకోదగ్గ కొత్త సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి కాబట్టి అవెంజర్స్ దూకుడు తగ్గుతుందో లేదో చూడాలి. అసలు అన్నింటికన్నా మించి సమ్మర్ హాలీ డేస్ అవెంజర్స్ కు భలే కలిసివచ్చింది. పిల్లలు యునానిమస్ గా తమ ఛాయస్ అవెంజర్స్ అనటం వల్ల పేరెంట్స్ కూడా దానికి ఓటు వేయక తప్పలేదు. అందుకే ఇన్ని భారీ కలెక్షన్లు.