Begin typing your search above and press return to search.

అవెంజర్స్ దంచికొడుతున్నారు

By:  Tupaki Desk   |   30 April 2018 4:47 AM GMT
అవెంజర్స్ దంచికొడుతున్నారు
X
హాలీవుడ్ సినిమాలకు ఇండియాలో డిమాండ్ ఎక్కువగానే ఉంటుంది. అలాంటిది అవెంజర్స్ లాంటి మూవీస్ కి ఈ క్రేజ్ మరీ ఎక్కువగా ఉంటుంది అని ముందు నుంచి అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రానికి తొలి రెండు రోజులలో.. ఇండియాలో మాత్రమే వచ్చిన వసూళ్లు చూసి.. ట్రేడ్ జనాలకు కూడా మైండ్ బ్లాంక్ అయిపోతోంది.

ప్రీ బుకింగ్స్ లో బాహుబలి2 తర్వాత స్థానంలో నిలిచినపుడే.. ఇండియాలో అవెంజర్స్- ద ఇన్ఫినిటీ వార్ కొత్త రికార్డులు సృష్టించడం ఖాయం అని అర్ధమైపోయింది. తొలి రోజున ఈ చిత్రం దేశవ్యాప్తంగా 31 కోట్ల రూపాయల షేర్ వసూలు చేసి సెన్సేషన్ సృష్టించింది. ఒక హాలీవుడ్ సినిమాకి ఇండియాలో ఇదే అతి పెద్ద రికార్డు. ఇదే సంచలనం అనుకుంటే.. రెండో రోజు కూడా అదే నిలకడ చూపించి.. 30 కోట్ల రూపాయలను వసూలు చేయడం చూసి.. అందరూ షాక్ తినేస్తున్నారు. ఆదివారం రోజున ఈ వసూళ్లు మరింతగా పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి.

తొలి వీకెండ్ ముగిసేలోపే 100 కోట్ల రూపాయల షేర్ ను సాధించడం అవెంజర్స్ లేటెస్ట్ వెర్షన్ కు పెద్ద కష్టమేమీ కాబోదు. ఇప్పటివరకూ ఇండియాలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా జంగిల్ బుక్ కి రికార్డు ఉంది. ఫుల్ రన్ లో ఆ మార్కును అవెంజర్స్ దాటేయడం ఖాయంగా కనిపిస్తోంది. సమ్మర్ సీజన్ లో వచ్చిన చిత్రం కావడంతో.. అవెంజర్స్ ఫైనల్ వసూళ్లను ఇప్పుడే అంచనా వేయడం కూడా కష్టమే.