Begin typing your search above and press return to search.

ఎవెంజర్స్: ఇన్ఫినిటీవార్‌.. షాక్ ఇచ్చిందిగా

By:  Tupaki Desk   |   28 April 2018 4:56 PM GMT
ఎవెంజర్స్: ఇన్ఫినిటీవార్‌.. షాక్ ఇచ్చిందిగా
X
ప్రస్తుత రోజుల్లో అభిమానుల్లో చాలా మార్పు వచ్చిందనే చెప్పాలి. బాషబేధం అస్సలు పట్టించుకోవడం లేదు. చూసే సినిమా ఆహ్లాదకరంగా ఉందా లేదా అనే విషయాన్ని మాత్రమే పట్టించుకుంటున్నారు. మన దేశంలో గత కొంత కాలంగా ఇంగ్లీష్ సినిమాలకు మంచి ఆదరణ దక్కుతోంది. ముఖ్యంగా విజువల్ వందర్స్ తో వచ్చే సినిమాలు రికార్డు స్థాయిలో కలెక్షన్స్ అందుకుంటున్నాయి. 2013 యుగాంతం - అవతార్ వంటి సినిమాలు హాలీవుడ్ సినిమాలకు అలవాటు పడేలా చేశాయి.

అసలు మ్యాటర్ లోకి వస్తే.. శుక్రవారం రిలీజ్ అయిన అవేంజర్స్: ఇన్ఫినిటీవార్‌ ఇండియాలో రికార్డ్ స్థాయిలో ఓపెనింగ్స్ అందుకుంది. ఈ ఏడాది బాలీవుడ్ సినిమాలు అందుకొని ఓపెనింగ్స్ ని ఈ హాలీవుడ్ సినిమా అందుకోవడం చూస్తుంటే సినిమా ఏ రేంజ్ లో క్రేజ్ ను సంపాదించుకుందో అర్థం చెసుకోవచ్చు. భాగీ 2 ఈ ఏడాది అత్యధికంగా 25.10 కోట్ల ఓపెనింగ్స్ అందుకోగా ఎవెంజర్స్: ఇన్ఫినిటీవార్‌ డబ్బింగ్ కలెక్షన్స్ తో కలుపుకొని 31.05 కోట్ల రూపాయల కలెక్షన్స్ ని కొల్లగొట్టింది. ఇంత వరకు ఏ ఇంగ్లీష్ సినిమా కూడా ఈ రేంజ్ లో కలెక్షన్స్ అందుకోలేదు.

పైగా పాజిటివ్ టాక్ వస్తుండడంతో నెక్స్ట్ కలెక్షన్స్ లో కూడా రికార్డ్ బ్రేక్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటివరకు 2018లో అత్యదిక ఓపెనింగ్స్ అందుకున్న చిత్రాలు.

1. ఎవెంజర్స్ ఇన్ఫినిటీవార్‌-రూ.31.30 కోట్లు. (ఇంగ్లీషు + డబ్బింగ్‌ వెర్షన్స్‌)

2. బాఘి 2 -రూ.25.10 కోట్లు.

3. పద్మావత్ – రూ.19 కోట్లు.

4. ప్యాడ్‌మ్యాన్‌ -రూ.10.26 కోట్లు.

5. రెయిడ్‌ -రూ.10.04 కోట్లు రాబట్టాయి