Begin typing your search above and press return to search.

అవ‌తార్ నాలుగు సీక్వెల్స్ రిలీజ్ తేదీలు

By:  Tupaki Desk   |   8 May 2019 12:04 PM IST
అవ‌తార్ నాలుగు సీక్వెల్స్ రిలీజ్ తేదీలు
X
దాదాపు ప‌దేళ్ల క్రితం రిలీజైంది అవ‌తార్ (2009). బాక్సాఫీస్ వ‌ద్ద ఆ సినిమా సృష్టించిన సంచ‌ల‌నాల గురించి ఇప్ప‌టికీ ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతూనే ఉంది. `అవెంజ‌ర్స్ -ఎండ్ గేమ్` రిలీజ్ సంద‌ర్భంగా మ‌రోసారి అవ‌తార్ రికార్డుల గురించిన ప్ర‌స్థావ‌న వ‌చ్చింది. దాదాపు 2.78 బిలియ‌న్ డాల‌ర్ల వ‌సూళ్ల‌తో అవ‌తార్ రికార్డ్ ఇప్ప‌టికీ ప‌దిలంగానే ఉంది. ఆ రికార్డును ఎండ్ గేమ్ చెరిపేస్తుంద‌న్న ముచ్చ‌టా సాగుతోంది. అయితే ఇదే సంద‌ర్భంలో అవతార్ సీక్వెల్స్ గురించిన ఆస‌క్తిక‌ర‌ స‌మాచారం అందింది. `ఎండ్ గేమ్` రికార్డుల‌కు చెక్ పెట్టే సత్తా ఉన్న ఫ్రాంఛైజీ అవ‌తార్ నుంచి వ‌రుస‌గా బుల్లెట్లు దూసుకురానున్నాయ్‌.

ఈ ఫ్రాంఛైజీ నుంచి వ‌రుస‌గా నాలుగు సీక్వెల్స్ రెండేళ్ల కోసారి ట్రీట్ ఇచ్చేందుకు ప్ర‌పంచ‌వ్యాప్తంగా అభిమానుల ముందుకు రానున్నాయి. వాస్త‌వానికి అవ‌తార్ 2 చిత్రం 2020 డిసెంబ‌ర్ లో రిలీజ్ కావాల్సింది. కానీ ఆ ఫ్రాంఛైజీ నిర్మాణ సంస్థ‌ ట్వంటీ ఫ‌స్ట్ సెంచ‌రీ ఫాక్స్ ను వాల్ట్ డిస్నీ సంస్థ కొనేయ‌డంతో ఈ మెర్జింగ్ ప్రాసెస్ లో సీక్వెల్ ఉంటుందా లేదా? అన్న సందేహాలు వ్య‌క్త‌మ‌య్యాయి. కానీ డిస్నీ సంస్థ ప్ర‌స్తుతం ఈ ఫ్రాంఛైజీని అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌కంగా భావించి మునుప‌టి కంటే రెట్టింపు విజువ‌ల్ ట్రీట్ తో తెర‌కెక్కిస్తోంద‌ని తెలుస్తోంది. తాజాగా డిస్నీ సంస్థ అవ‌తార్ సీక్వెల్స్ రిలీజ్ తేదీల‌ను మ‌రోసారి ప్ర‌క‌టించింది. తొలిగా `అవ‌తార్ 2` చిత్రం 17 డిసెంబ‌ర్ 2021న రిలీజ్ కానుంది.

త‌దుప‌రి 22 డిసెంబ‌ర్ 2023లో అవ‌తార్ 3 రిలీజ‌వుతుంది. అటుపై 12 డిసెంబ‌ర్ 2025న అవ‌తార్ 4.. 17 డిసెంబ‌ర్ 2027లో అవ‌తార్ 5 రిలీజ‌వుతాయి. ఈ ఫ్రాంఛైజీలో వ‌రుస‌గా నాలుగు సినిమాలు అవ‌తార్ 2,3,4&5) రెండేళ్లకోసారి అభిమానుల్ని అల‌రించేందుకు థియేట‌ర్ల‌లోకి రానున్నాయి. అంటే 2021 మొద‌లు 2027 వ‌ర‌కూ ఈ ఫ్రాంఛైజీ ఫ్యాన్స్ కి అబ్బుర‌ప‌రిచే వినోదం ద‌క్క‌నుంది. ఈ సిరీస్ సినిమాల రికార్డుల గురించి ఆస‌క్తిక‌ర చ‌ర్చ అంతే ఇదిగా సాగ‌నుంద‌న్న‌మాట‌. టైటానిక్ ఫేం జేమ్స్ కామెరూన్ ఈ ఫ్రాంఛైజీ చిత్రాల‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న సంగతి తెలిసిందే. పండోరా గ్ర‌హంపై జీవించే గిరిజ‌న జాతి (అవతార్) మ‌నుగ‌డ‌కు భూగ్ర‌హం వాసుల‌ వ‌ల్ల త‌లెత్తిన ప్ర‌మాద‌మేంటి? ఆ ప్ర‌మాదం నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు ఏం చేశారు? అన్న‌ది సీక్వెల్ సినిమాల కొన‌సాగింపు క‌థాంశం అని తెలుస్తోంది.