Begin typing your search above and press return to search.

అవతార్ లవర్స్.. ఈ డేట్లు రాసుకోండి

By:  Tupaki Desk   |   24 April 2017 10:49 AM GMT
అవతార్ లవర్స్.. ఈ డేట్లు రాసుకోండి
X
అవతార్.. ప్రపంచ సినీ చరిత్రలో ఒక ప్రత్యేక అధ్యాయం. అమెరికాలో ఉన్న హైక్లాస్ ఆడియన్స్ దగ్గర్నుంచి మన పల్లెట్లూర్లలో ఉన్న మాస్ ప్రేక్షకుల వరకు అందరినీ అబ్బుర పరిచిన సినిమా అది. ఈ సినిమాకు సీక్వెల్ అంటూ ఎప్పట్నుంచో ఊరిస్తున్నాడు జేమ్స్ కామెరూన్. ‘టైటానిక్’ తీశాక 11 ఏళ్ల విరామం తీసుకుని వెండితెరపై ‘అవతార్’ అద్భుతాల్ని ఆవిష్కరించిన కామెరూన్.. ఇక తన మిగతా సినీ జీవితాన్ని ‘అవతార్’ సీక్వెల్స్ కోసమే కేటాయించాడు.

పర్ఫెక్షన్ కోసం ప్రాణం పెట్టి పని చేసే కామెరూన్.. ‘అవతార్-1’ వచ్చిన 11 ఏళ్లకు అవతార్-2 రాబోతోంది. అదొక్కటే కాదు.. దాంతో పాటు మరో మూడు సీక్వెల్స్ కూడా రాబోతున్నాయి. ఈ నాలుగు సీక్వెల్స్ డేట్లను నిర్మాణ సంస్థ ట్వంటీయత్ సెంచరీ ఫాక్స్ ప్రకటించింది. గతంలో ఇచ్చిన డేట్లలో మార్పులు చోటు చేసుకున్నాయి. ఐతే అవతార్ సిరీస్ ఐదో భాగంతో ఆగిపోదట. ఆ తర్వాత కూడా ఈ ఫ్రాంఛైజీ కొనసాగుతుందని ట్వంటీయత్ సెంచరీ ఫాక్స్ తెలపడం విశేషం.

అవతార్ నాలుగు సీక్వెల్స్ రిలీజ్ డేట్లు..

అవతార్-2 2020 డిసెంబరు 18

అవతార్-3 2021 డిసెంబరు 17

అవతార్-4 2024 డిసెంబరు 20

అవతార్-5 2025 డిసెంబరు 19