Begin typing your search above and press return to search.

అవతార్ 2 దండయాత్రకి సిద్ధం..!

By:  Tupaki Desk   |   14 Dec 2022 4:30 PM GMT
అవతార్ 2 దండయాత్రకి సిద్ధం..!
X
ప్రపంచవ్యాప్తంగా అవతార్ 2 దండయాత్ర కి సిద్ధమైంది. రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాపై సినీ ప్రియులంతా ప్రత్యేకమైన ఆసక్తి కనబరుస్తున్నారు. ముఖ్యంగా ఇండియన్ స్క్రీన్స్ పై అవతార్ 2 ఓ రేంజ్ లో సందడి చేయబోతుంది. బాలీవుడ్ లో పెద్దగా సినిమాలేవి లేకపోవడం వల్ల అవతార్ 2 ఒక్కటే అదరగొట్టబోతుంది. ఇటు సౌత్ మార్కెట్ లో కూడా అవతార్ 2 భారీ రేంజ్ లో రిలీజ్ అవుతుంది. తెలుగు రాష్ట్రాల్లో అవతార్ 2 కోసం మల్టీప్లెక్స్ లు.. సింగిల్ థియేటర్లు రెడీ అయ్యాయి.

తెలుగులో పోటీగా సినిమాలేవి లేకపోవడం కూడా ఇందుకు కలిసి వచ్చే అంశమే. హిట్ 2, మసూద తర్వాత లాస్ట్ ఫ్రై డే రిలీజైన ఏ సినిమా ఆశించిన స్థాయిలో లేకపోవడంతో అవతార్ 2 కి కలిసి వచ్చింది. కొద్ది పాటి పాజిటివ్ టాక్ వచ్చినా సరే అవతార్ 2 అద్భుతాలు సృష్టించే ఛాన్స్ ఉంది. ఇప్పటికే బుకింగ్స్ జోరుగా అవుతున్నాయి. అవతార్ 2 ఫస్ట్ డే భారీ టార్గెట్ పెట్టుకుందని తెలుస్తుంది.

తెలుగు రాష్ట్రాల్లోనే ఈ ఫిగర్ మైండ్ బ్లాక్ అయ్యేలా తెస్తుందని అంటున్నారు. జేమ్స్ కామెరూన్ అద్భుత సృష్టి మరోసారి సినీ ప్రేక్షకులను ఐ ఫీస్ట్ అందించడానికి రెడీ అయ్యింది.

సినిమా ట్రైలర్ అంచనాలు పెంచగా విజువల్ వండర్ గా అవతార్ 2 ఆడియన్స్ ని అలరించనుందని ఫిక్స్ అయ్యారు. 2009 లో వచ్చిన అవతార్ సినిమాకు సీక్వెల్ తీసేందుకు దాదాపు 13 ఏళ్లు టైం తీసుకున్నాడు డైరెక్టర్ జేమ్స్ కామెరూన్. ఇన్నేళ్లు తను పడ్డ శ్రమ అంతా మరో రెండు రోజుల్లో వెండితెర మీద ఆవిష్కృతమవుతుంది.

అవతార్ 2 సినిమా త్రీడీ, 2డి రెండిటిలో అందుబాటులో ఉంటుంది. అయితే ఎక్కువగా ఆడియన్స్ త్రీడీ వర్షన్ కే ఆసక్తి కనబరుస్తున్నారు. హైదరాబాద్, వైజాగ్, విజయవాడ లాంటి సిటీల్లో ఇప్పటికే మొదటిరోజు ఆల్మోస్ట్ బుకింగ్స్ పూర్తయ్యాయని అంటున్నారు.

ఏది ఏమైనా ఒక హాలీవుడ్ సినిమాకు ఈ రేంజ్ రెస్పాన్స్ రావడం అన్నది సాధారణమైన విషయం కాదు. తెలుగు రెండు రాష్ట్రాల్లోనే కాదు వరల్డ్ వైడ్ గా అవతార్ 2 ది వే ఆఫ్ వాటర్ గురించి ఆడియన్స్ ఇదే ఆసక్తితో ఉన్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.