Begin typing your search above and press return to search.

ఇప్పుడు నిహారిక గుసగుసలాడే!!

By:  Tupaki Desk   |   16 Sept 2016 10:09 PM IST
ఇప్పుడు నిహారిక గుసగుసలాడే!!
X
మెగా ఫ్యామిలీ హీరోలపై ఈ మధ్య వరసగా భలే షాకులు ఇచ్చారు. వరుసగా ఈ ఫ్యామిలీలో హీరోలందరూ ఫ్లాప్ డైరెక్టర్లకే సినిమా ఛాన్స్ ఇచ్చి ఆశ్చర్యపరిచారు. అఖిల్ తో ఫ్లాప్ కొట్టిన వినాయక్. - మెగాస్టార్ తో ఖైదీ నెంబర్ 150 చేస్తున్నాడు. కిక్2తో డిజాస్టర్ తీసిన సురేందర్ రెడ్డితో.. రామ్ చరణ్ ధృవ తీస్తున్నాడు. వరుస ఫ్లాపుల్లో ఉన్న శ్రీను వైట్లతో వరుణ్ తేజ్ మిస్టర్ చేస్తుండగా.. ఇదే హీరో శేఖర్ కమ్ములతో ఫిదా చేస్తున్నాడు. ఈ లిస్ట్ ఇంకా చాలా ఉంటుంది కానీ.. ఇప్పుడు హిట్ డైరెక్టర్ కి కూడా మెగా కాంపౌండ్ నుంచి పిలుపు వెళ్లిందనే టాక్ వినిపిస్తోంది.

శ్రీనివాస్ అవసరాల వరుసగా రెండు సినిమాలను సక్సెస్ చేసి జోష్ మీద ఉండగా.. మూడో మూవీ కూడా ఇప్పటికే ఖాయం అయింది. నాని హీరోగా ఈ సినిమా తెరకెక్కనుండగా.. దీని తర్వాత తమకు ఓ సినిమా చేయాల్సిందిగా మెగా టీమ్ నుంచి పిలుపు వచ్చిందట. ముఖ్యంగా అల్లు అరవింద్ డిస్కషన్స్ చేస్తున్నాడని అంటున్నారు. మెగా డాటర్ నీహారికతో కానీ.. అల్లు శిరీష్ తో కానీ సినిమా చేయాల్సిందిగా కోరారట అల్లు వారు. ఎక్కువగా నిహారికతో ఊహలు గుసగుసలాడే టైపు ఫిలిం ప్లాన్ చేయమని అవసరాలను అడిగారట. అయితే.. దీనిపై మెగా క్యాంప్ నుంచి కానీ.. అవసరాల నుంచి కానీ క్లారిటీ రాలేదు. నిజానికి వచ్చే ఛాన్స్ కూడా లేదు లెండి. ఇలాంటి డిస్కషన్స్.. ఇండస్ట్రీలో జరుగుతూనే ఉంటాయ్ మరి. ఇలాంటివాటిలో వందకి ఒకటి పట్టాలెక్కుతుంది. మిగతావన్నీ జస్ట్ ప్రాబబిలిటీ మాట్లాడుకుంటారంతే.