Begin typing your search above and press return to search.

మెగా హీరోతో కమిటయ్యాడు

By:  Tupaki Desk   |   12 April 2018 6:30 PM GMT
మెగా హీరోతో కమిటయ్యాడు
X
టాలీవుడ్ లో బడా ఫ్యామిలీ నుంచి హీరోలు పరిచయమై చాలా కాలమవుతోంది. ఇప్పటికే నాలుగైదు ఫ్యామిలీల నుంచి కొంతమంది వరుసపెట్టి అవకాశాలు అందుకొని హీరోలుగా మంచి సక్సెస్ ట్రాక్ లో దూసుకుపోతున్నారు. అసలు మ్యాటర్ లోకి వెళితే మెగా ఫ్యామిలి నుంచి కూడా ఒక యువకుడు గత కొంత కాలంగా సినిమాల్లోకి రావాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. అతను ఎవరో ఇప్పటికే ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది. మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్.

మనోడు చాలా కాలంగా యాక్టింగ్ లో కోచింగ్ తీసుకుంటున్నాడు. అంతే కాకుండా మామయ్య పవన్ కళ్యాణ్ దగ్గర మార్షల్ ఆర్ట్స్ కి సంబంధించిన టెక్నీక్స్ పై కూడా పట్టు సాధించాడు. ఇక అసలు మ్యాటర్ లోకి వస్తే.. వైష్ణవ్ తేజ్ మొదటి సినిమాను డైరెక్ట్ చేయబోయేది ఎవరో కాదు. నటుడిగానే కాకుండా ఊహలు గుసగుసలాడే సినిమాతో డైరెక్టర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రీనివాస్ అవసరాల మెగా హీరోతో వర్క్ చేయనున్నాడు. శ్రీనివాస్ రెండవసారి జ్యో అచ్యుతానందా అనే సినిమా చేశాడు. కానీ ఆ సినిమా అనుకున్నంత రేంజ్ లో హిట్ అవ్వలేదు.

అలాగే నానితో కూడా ఒక సినిమా చేయాలని శ్రీనివాస్ కథను రెడీ చేసుకున్నాడు. నాని కూడా పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యాడు. అయితే నాని రేంజ్ ఒక్కసారిగా పెరగడంతో కథలో మార్పుల్ని చేయాల్సి ఉందని చెప్పాడు. పైగా నాని ప్రస్తుతం బిజీగా ఉన్నాడు. సో ఇప్పుడు మెగా హీరోని పరిచయం చేసేఆవకాశం రావడంతో మిస్ చేసుకోవద్దని శ్రీనివాస్ డిసైడ్ అయ్యాడు. తన మార్క్ కామెడీ అండ్ లవ్ ఎంటర్టైనర్ ను వైష్ణవ్ తేజ్ తో తిస్తాడట. సాయి కొర్రపాటి ఆ సినిమాను నిర్మించేందుకు సన్నాహకలు చేస్తున్నారు.