Begin typing your search above and press return to search.

నాగశౌర్య - అవసరాల కాంబో ఒన్స్ మోర్

By:  Tupaki Desk   |   2 March 2019 1:17 PM GMT
నాగశౌర్య - అవసరాల కాంబో ఒన్స్ మోర్
X
యువ హీరో నాగశౌర్య సినిమాల ఎంపికలో మళ్ళీ జోరు పెంచాడు. '@నర్తనశాల' తర్వాత నందినిరెడ్డి దర్శకత్వంలో 'ఓ బేబీ' సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.  ఈ సినిమా కాకుండా మరో సినిమాను లైన్లో పెట్టాడు శౌర్య.  ఈ సినిమా అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కనుంది.   వీరిద్దరి కాంబినేషన్ లో గతంలో 'ఊహలు గుస గుస లాడే'.. 'జో అచ్యుతానంద' లాంటి హిట్ సినిమాలు తెరకెక్కాయి.  ఈ సినిమా వీరిద్దరి కాంబినేషన్లో హ్యాట్రిక్ ఫిలిం కానుంది.

ఈ సినిమాలో నాగశౌర్య సరసన మాళవిక నాయర్ ను హీరోయిన్ గా ఎంపిక చేశారు.  శౌర్య - మాళవిక నాయర్ గతంలో 'కళ్యాణవైభోగమే' సినిమాలో హీరో హీరోయిన్లుగా ప్రేక్షకులను మెప్పించిన విషయం తెలిసిందే.  మరోసారి ఈ జంట తెరపై ప్రేమికులుగా అల్లరి చేసేందుకు రెడీ అవుతున్నారన్నమాట.  ఈ చిత్రాన్ని టీ.జీ. విశ్వ ప్రసాద్.. దాసరి పద్మజలు  పీపుల్ మీడియా ఫ్యాక్టరీ.. దాసరి ప్రొడక్షన్స్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మిస్తారు.  మార్చ్ రెండవ వారంలో రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమాలో ఇతర నటీనటులు.. టెక్నిషియన్స్ వివరాలను త్వరలోనే వెల్లడిస్తారు.

కాంబినేషన్ చూస్తుంటే పర్ఫెక్ట్ గా ఉంది.  అవసరాల శ్రీనివాస్ సినిమాలు సెన్సిబుల్ గా ఉంటూ ఫ్యామిలీ ఆడియన్స్ నే కాకుండా ఈ జెనరేషన్ ఆడియన్సునూ మెప్పిస్తాయి.  అవసరాల -నాగ శౌర్య కాంబో లో వచ్చిన సినిమాలు హిట్సే కాబట్టి ఈ సినిమా కూడా ప్రేక్షకులను మెప్పించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.