Begin typing your search above and press return to search.

అవసరాల ఆ విషయం ఎందుకు రివీల్ చేశాడు?

By:  Tupaki Desk   |   7 Sept 2016 7:00 AM IST
అవసరాల ఆ విషయం ఎందుకు రివీల్ చేశాడు?
X
జ్యో అచ్యుతానంద’ టీజర్.. ట్రైలర్ చూసి.. ఇదో ట్రయాంగిల్ లవ్ స్టోరీ అనుకున్నారు జనాలు. ఇద్దరు అన్నదమ్ములు.. ఒకమ్మాయి ప్రేమను గెలుచుకోవడానికి ఏం చేశారో చూపించే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపించాడు అవసరాల. కానీ అంతలోనే ఒక షాకింగ్ పోస్టర్ రిలీజ్ చేసి అందరికీ షాకిచ్చాడు. అందులో హీరోలిద్దరికీ పెళ్లయినట్లు.. వాళ్లిద్దరి జీవితాల్లో వేరే అమ్మాయిలున్నట్లు సంకేతాలిచ్చాడు.

ఐతే థియేటర్లో సర్ ప్రైజ్ చేయకుండా.. ముందే అవసరాల ఈ విషయాన్ని ఎందుకు రివీల్ చేశాడా అని అందరికీ సందేహం కలిగింది. దీనిపై అవసరాల స్పందిస్తూ.. ‘‘కథలో ఒక అంశాన్ని దాచిపెడదాం అని నేనెప్పుడూ అనుకోను. సినిమాలో కూడా హీరోలిద్దరికీ పెళ్లి అయిన విషయం మొదటి షాట్‌ లోనే చెప్పేశాను. అసలు కథను ఆ తర్వాత ఎలా నడిపించానన్నదే నా రచనలో నేను చూపిన కొత్తదనంగా భావిస్తా’’ అని అవసరాల అన్నాడు.

‘ఊహలు గుసగుసలాడే’ చూశాక ప్రేక్షకులకు తన మీద ఒక అభిప్రాయం కలిగిందని.. ఐతే మళ్లీ అలాంటి సినిమానే తీయొద్దన్న ఉద్దేశంతోనే బాగా గ్యాప్ తీసుకుని.. మరో భిన్నమైన ప్రయత్నం చేశానని అవసరాల తెలిపాడు. ‘‘తొలి సినిమా తర్వాత గ్యాప్ కావాలనే తీసుకున్నా. ‘ఊహలు గుసగుసలాడే’ సింపుల్ లవ్‌ స్టోరీ. అందులోని బేసిక్ ఎమోషన్ కనెక్టవడం వల్ల ఇప్పటికీ ఆ సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు. ఐతే నా రెండో సినిమా కూడా అదే మాదిరి సింపుల్ లవ్‌ స్టోరీగా ఉండటం నాకిష్టం లేదు. అలా చేస్తే నాకు ఇలా తప్ప ఇంకోలా సినిమాలు తీయడం రాదన్న అభిప్రాయం కలుగుతుంది. అందుకే గ్యాప్ తీసుకొని ‘జ్యో అచ్యుతానంద’ అనే మరో భిన్నమైన సినిమా చేశాను’’ అన్నాడు.