Begin typing your search above and press return to search.

సాయి గారి 'బాండ్' కహానీ వినండి

By:  Tupaki Desk   |   8 Sept 2016 6:57 PM IST
సాయి గారి బాండ్ కహానీ వినండి
X
ప్రముఖ నిర్మాత సాయి కొర్రపాటి ఈ మధ్యన సరైన హిట్టు ఒక్కటి కూడా కొట్టలేదు. అందుకే రేపు రిలీజయ్యా ''జ్యో అచ్యుతానంద'' సినిమాపై ఆయన చాలా అంచనాలు పెట్టుకున్నారు. ఈ సందర్భంగా సరదాసరదాగా మాట్లాడుతూ.. అసలు సాయి కొర్రపాటి క్యాంపులో ఉన్న ''బాండ్'' గురించి చెప్పేశాడు దర్శకుడు శ్రీనివాస్ అవసరాల. అతనితోపాటు నారా రోహిత్ అండ్ నాగ శౌర్య కూడా జాయిన్ అవ్వడం కాస్త షాకింగే.

ఇక్కడ ''బాండ్'' అనే బాండింగ్ అనే రిలేషన్ అనుకునేరు.. కాదండోయ్.. ఈ బాండ్ అంటే ఎగ్రిమెంట్ అని. ''ఊహలు గుసగుసలాడే సినిమా తరువాత నేను సాయి గారితో చేయడానికి మేజర్ కారణం ఏంటంటే.. ఆయనతో నాకు 'బాండ్' ఉంది'' అనేశాడు దర్శకుడు అవసరాల. ఆ బాండ్ ఏ బాండో తెలియాలంటే.. మనం నాగ శౌర్య కామెంట్ కూడా వినాలేమో. ''అయితే నాకు ఇంకా బలమైన బాండ్ ఉంది సార్. నేను ఆయనకు మూడు సినిమాలు చేశాను సార్'' అంటూ నవ్వేస్తూనే నాగ శౌర్య మ్యాటర్ చెప్పాడు. ఊహలు గుసగుసలాడే సినిమా క్లయమ్యాక్స్ లో ఉండగా.. మనోడు దిక్కులు చూడకు రామయ్య షూటింగ్ కూడా మొదలెట్టాడట.

అయితే నారా రోహిత్ ఏమన్నా తక్కువా.. వెంటనే మనోడు అందుకుని ఏమన్నాడంటే.. ''మీరందరూ గ్యాపులిచ్చి చేశారు. నేనైతే మరి వరుసగా సాయి గారికే చేశాను'' అంటూ కత్తిలాంటి పంచ్ వదిలేశాడు. ఒక ప్రక్కన జ్యో అచ్యుతానందకు షూటింగ్ చేస్తూనే మరో ప్రక్కన రాజా చెయ్యి వేస్తే డబ్బింగ్ చెప్పాడట. మొత్తానికి ఈ దర్శక-హీరోలు అలా ''బాండ్‌'' గురించి వివరించారండోయ్. అది కహానీ.