Begin typing your search above and press return to search.

ఛలో అంటున్న అవసరాల

By:  Tupaki Desk   |   27 Jun 2018 11:36 AM IST
ఛలో అంటున్న అవసరాల
X
నటుడిగా ఒకవైపు మెప్పిస్తునే ఫీల్ గుడ్ మూవీస్ కు దర్శకుడిగా పేరు తెచ్చుకున్న అవసరాల శ్రీనివాస్ జ్యో అచ్యుతానంద తరువాత కొత్త ప్రాజెక్ట్ ఏది టేకప్ చేయలేదు. న్యాచురల్ స్టార్ నానితో ఒకటి చేస్తానని చెబుతూ వచ్చాడు అది పట్టాలు ఎక్కే సూచనలు దగ్గరలో లేవు. పైగా నాని ఇతర ప్రాజెక్ట్స్ తో యమా బిజీగా ఉన్నాడు కాబట్టి ఇప్పట్లో జరిగే అవకాశం లేనట్టే. తన మొదటి రెండు సినిమాలతో పాటు మూడోది కూడా వారాహి బ్యానర్ కే కమిట్ అయిన అవసరాల శ్రీనివాస్ దానికి రంగం సిద్ధం చేసుకున్నట్టు సమాచారం.

ఛలో తో సూపర్ సక్సెస్ అందుకుని మాంచి జోష్ లో ఉన్న నాగ శౌర్య హీరోగా సాయి కొర్రపాటి ఇది నిర్మించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలిసింది. బ్యాక్ డ్రాప్ కూడా అమెరికాలో ఉండబోతున్నట్టు వినికిడి. ఇది తనదైన మార్క్ లో లవ్ అండ్ ఎమోషన్ చుట్టూ ఉండేలా అవసరాల కథ రాసుకున్నట్టుగా ఇప్పటికే న్యూస్ వచ్చేసింది నాగ శౌర్య తనకు మంచి బ్రేక్ ఇచ్చి గుర్తింపు తెచ్చిన ఊహలు గుసగుసలాడే దర్శకుడిగా అవసరాల శ్రీనివాడు అడిగితే వద్దంటాడా. ప్రస్తుతం తన స్వంత బ్యానర్ ఐరా నిర్మిస్తున్న @నర్తనశాల షూటింగ్ లో బిజీగా శౌర్య ఆగస్ట్ లోపే దాన్ని ఫినిష్ చేసి దీనికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

అధికారికంగా ధ్రువీకరించలేదు కానీ చర్చలు జరిగినట్టు వినికిడి. సాయి కొర్రపాటి మెగా అల్లుడిని పరిచయం చేస్తూ తీసిన విజేత విడుదల అయ్యాక దీని గురించి మాట్లాడుదామని అవసరాలతో చెప్పినట్టు తెలిసింది. మరో సెన్సిబుల్ స్టోరీతో సిద్ధంగా ఉన్న అవసరాల నాలుగో సినిమా మాత్రం వేరే బ్యానర్ లో చేయబోతున్నాడు. అప్పుడు నానిది లైన్ లో వచ్చే అవకాశం ఉంది. దర్శకుడిగా కంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీగా ఉన్న అవసరాలకు చిన్న పాత్రే అయినా మహానటి సినిమాలో వేసిన దర్శకుడు ఎల్వి ప్రసాద్ వేషం మంచి పేరే తీసుకొచ్చింది.