Begin typing your search above and press return to search.

గర్భిణికి డెలివరీ చేసిన రియల్ హీరో ఆ సినీ రచయిత..

By:  Tupaki Desk   |   20 April 2020 11:20 AM IST
గర్భిణికి డెలివరీ చేసిన రియల్ హీరో ఆ సినీ రచయిత..
X
రీల్ సీన్ కు ఏ మాత్రం తగ్గని రియల్ ఉదంతంగా దీన్ని చెప్పాలి. నిజజీవితంలో సినీ రచయితగా సుపరిచితుడైన ఒకరు.. ఆపదలో ఉన్న గర్భిణికి డెలివరీ చేయటం ద్వారా సంచలనంగా మారారు.తమిళనాడులో చోటు చేసుకున్న ఈ ఉదంతంలోకి వెళితే.. వెట్ట్రిమారన్ దర్శకత్వంలో రూపొందిన సంచలన చిత్రం విచారణై. కోవైకు చెందిన ఆటో డ్రైవ్ అయిన చంద్రన్.. తన నిజజీవితంలో ఎదుర్కొన్న అంశాలతో కథను రూపొందించారు. దీన్ని సినిమాగా తీయగా సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది.

ఇదిలా ఉంటే.. తాజాగా కరోనా నేపథ్యంలో ఎవరికి వారు ఇళ్లకే పరిమితమయ్యారు. లాక్ డౌన్ లో ఉన్న వేళ.. ఒడిశాకు చెందిన భవన నిర్మాణ కార్మికులకు చెందిన ఒక గర్భిణి పురిటి నొప్పులకు గురయ్యారు. అంబులెన్స్ కు ఫోన్ చేయగా.. అది రావటంలో ఆలస్యమైంది. పరిస్థితి అంతకంతకూ విషమిస్తున్న వేళ.. ఎవరూ ముందుకు రాని దుస్థితి. ఇలాంటివేళ.. చంద్రన్ సాహసమే చేశారు.

పురిటి నొప్పులతో బాధపడుతున్న ఆమె గురించి తెలుసుకున్న చంద్రన్ ఆమెకు డెలివరీ చేసే ప్రయత్నం చేసి సక్సెస్ అయ్యారు. ఆయనేమాత్రం ఆలస్యం చేసినా.. మహిళకు ముప్పుగా మారేదని చెబుతున్నారు. కష్టంలో ఉన్న మహిళకు సాయం చేయటాన్ని అభినందించాల్సిందే. అయితే.. ఇలాంటి విషయాల్లో అవగాహన లేకుండా చేయటం ప్రమాదమన్నది మర్చిపోకూడదు. అయినప్పటికి మహిళ ప్రాణాల్ని కాపాడేందుకు చేసిన సినీ రచయిత కమ్ ఆటోడ్రైవర్ చంద్రన్ ను అభినందించాల్సిందే.