Begin typing your search above and press return to search.

​రెహ్మాన్ తమిళంతో వాళ్లు హర్టయ్యారు

By:  Tupaki Desk   |   14 July 2017 9:44 AM GMT
​రెహ్మాన్ తమిళంతో వాళ్లు హర్టయ్యారు
X
ఒక గొప్ప మ్యూజిక్ కంపోజర్ గా ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చుకున్న ఏ ఆర్ రెహ్మాన్ సినిమాలుకు సంగీతం ఇవ్వడం తో పాటుగా చాల చోట్లకు వెళ్ళి సంగీత కచేరీలు కూడా జరుపుతూ ఉంటాడు. అలా ఎక్కడకు వెళ్ళినా అతనికి గొప్ప స్వాగతమే పలుకుతారు అభిమానులు. ఒక సౌత్ ఇండియన్ మ్యూజిక్ డైరెక్టర్ కు ప్రపంచలో అన్నీ దేశాలలో ఇంతమంది అభిమానులు ఉండటం ఆది ఒక్క రెహ్మాన్ కు మాత్రమే సాధ్యపడింది. కానీ అటువంటి రెహ్మాన్ స్టేజ్ పై పాడుతుంటే మొన్న కొంతమంది లేచి వెళ్ళిపోయారు తెలుసా?

జూలై 8 నాడు లండన్లో ఉన్న వెంబ్లేలో ఒక షో చేశాడు రెహ్మాన్. ఆ షోకు అక్కడ మంచి ప్రచారమే చేశారు. “నేత్రు ఇంద్రు నలై” పేరు పెట్టి ఏర్పాటు చేసిన ఈ ఆర్కెస్ర్టా ప్రోగ్రామ్ కు వచ్చిన వాళ్ళలో ఎక్కువమంది హింది వాళ్ళూ ఉన్నారు. కానీ షో లో రెహ్మాన్ చాల పాటలు తమిళ్ లో పాడాడు. దానితో అక్కడ వచ్చిన హింది అభిమానులు భాడపడి ఏంటి వీళ్ళు అన్నీ తమిళ్ పాటలు పడుతున్నారు మాకేం అర్ధం కావటం లేదు అని అక్కడ పెద్ద రచ్చ చేశారట. మరి కొంతమంది అయితే మా డబ్బులు మాకు ఇవ్వండి అని గొడవపెట్టుకున్నారు కూడా. రెహ్మాన్ ఆ షో లో ఒకటో రెండో హింది పాటలు పాడాడని తెలుస్తోంది.

అలా గాయపడిన అభిమానులలో కొంత మంది సోషల్ మీడియా లోకి వచ్చి వాళ్ళ కోపాన్ని చూపిస్తున్నారు. తప్పుడు ప్రచారం చేసి అందరిని మోసం చేశారు అని వాపోతున్నారు. ఏదైనా మనవాళ్ళు ఎప్పుడు ఎందుకు భాదపడిపోతారో అస్సలు ఊహించలేము. పేరు కూడా వాళ్ళు తమిళ్ లోనే పెట్టి ప్రచారం చేశారు కదా బాబు అని ఎవరు చెప్పినా వినేటట్లు లేరు. ఈ విషయం పై రెహ్మాన్ అయితే ఎటువంటి స్పందన ఇవ్వలేదు అనుకోండి.