Begin typing your search above and press return to search.

జనాలు హీరోయిన్ కొలతలు తీస్తున్నారు

By:  Tupaki Desk   |   28 May 2017 4:47 AM GMT
జనాలు హీరోయిన్ కొలతలు తీస్తున్నారు
X
గోదావరి.. అమ్మాయిలు.. వంశీ సినిమాల్లో ఏది అందంగా కనిపిస్తుందంటే చెప్పడం బాగా క్లిష్టమైన విషయమే. ఆడియన్స్ పల్స్ ను పట్టుకోవడంలో దిట్ట అయిన దర్శకుడు వంశీ.. ఇప్పుడు 'ఫ్యాషన్ డిజైనర్ సన్నాఫ్ లేడీస్ టైలర్' అంటూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. జూన్ 2న విడుదల కానున్న ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉండగా.. జనాల్లో ఈ మూవీపై ఎంతటి క్యూరియాసిటీ ఉందనే విషయాన్ని ఓ ఫోటో ప్రూవ్ చేస్తోంది.

హీరోయిన్ అనీషా ఆంబ్రోస్ కు హీరో సుమంత్ అశ్విన్ కొలతలు తీసుకుంటున్న ఫోటోను.. ఫ్యాషన్ డిజైనర్ ఫస్ట్ లుక్ గా ఇచ్చినపుడు.. బోలెడన్ని విమర్శలు వచ్చాయి. కానీ ఈ పబ్లిసిటీ పోస్టర్ బాగానే వర్కవుట్ అయిందని చెప్పచ్చు. కొన్ని థియేటర్లలో ఉన్న ఫ్లెక్సీల దగ్గర జనాలు పోజులతో ఇరగదీసేస్తున్నారు. హైద్రాబాద్ లోని ఓ మల్టీప్లెక్స్ లో తీసిన ఫోటో ఇది. సుమంత్ అశ్విన్ ప్లేస్ లో తానే ఉండి.. అనీషా ఆంబ్రోస్ కొలతలు తీస్తున్నట్లుగా పోజ్ ఇచ్చాడో వ్యక్తి. ఇలా పోస్టర్లలో ఉన్న మాదిరిగా ఫ్యాన్స్ పోజులు ఇవ్వడం చాలాసార్లే చూస్తుంటాం.

కానీ ఈ ఫోటో మాత్రం ఇంటర్నెట్ లో విపరీతంగా షేర్ అయిపోతోంది. కొలతల పోస్టర్ పై ప్రేక్షకుల్లో ఎంతటి కుతూహలం ఉందని చెప్పేందుకు ఈ పోస్టర్ ను సాక్ష్యంగా చెప్పచ్చు. అనీషాతో పాటు మానస హిమవర్ష.. మనాలి రాథోడ్ ఫ్యాషన్ డిజైనర్ లో హీరోయిన్స్ గా నటించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/