Begin typing your search above and press return to search.

అటెన్షన్ ఎవ్రీబ‌డీ.. వెంకీకి రేర్‌ బ‌ర్త్ డే గిఫ్ట్

By:  Tupaki Desk   |   13 Dec 2020 1:03 PM IST
అటెన్షన్ ఎవ్రీబ‌డీ.. వెంకీకి రేర్‌ బ‌ర్త్ డే గిఫ్ట్
X
`అటెన్షన్‌ ఎవ్రీబడీ.. నేనొస్తున్నా బిరెడీ నేనే మహారాజు! .. విక్ట‌రీ వెంక‌టేష్ కెరీర్ లో చార్ట్ బ‌స్ట‌ర్ సాంగ్ ఇది. ఎస్పీబీ సుస్వ‌రగానంలో ఈ పాట అప్ప‌ట్లో సెన్సేష‌న్ క్రియేట్ చేయ‌గా.. విక్ట‌రీ వెంక‌టేష్ పాప్ స్టార్ ని త‌ల‌పించే స్టెప్పుల‌తో అద‌ర‌గొట్టారు.

నేడు (13 డిసెంబ‌ర్) వెంకీ బ‌ర్త్ డే సంద‌ర్భంగా ఈ పాట‌ను రాజాకుమారి రీమిక్స్ చేసి యూట్యూబ్ చానెల్లో రిలీజ్ చేయగా అది యువ‌త‌రంలో హిప్నోటిక్ వైబ్స్ క్రియేట్ చేస్తోంది. సౌత్ ‌బై లైవ్ యూట్యూబ్ ఛానెల్ లో ఈ పాట‌ను రిలీజ్ చేశారు. రాజా కుమారి హ‌స్కీ వాయిస్ ఈ సాంగ్ కి పెప్ ని యాడ్ చేసింద‌నే చెప్పాలి.

వెంక‌టేష్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా ఇంత‌కుముందు `గ్లింప్స్ ఆఫ్ నార‌ప్ప` విజువ‌ల్ ట్రీట్ వైర‌ల్ గా మారిది. వెంకీ మాసీ అవ‌తార్ 2 మిలియ‌న్ వ్యూస్ ని అధిగ‌మించి వైర‌ల్ గా దూసుకెళుతోంది. అలాగే యూట్యూబ్ చానెల్లో రాజాకుమారి సాంగ్ ప్ర‌త్యేక పుట్టిన‌రోజు కానుక అనే చెప్పాలి.