Begin typing your search above and press return to search.

దాసరి కుమారుడిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు

By:  Tupaki Desk   |   18 Aug 2021 2:13 PM IST
దాసరి కుమారుడిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు
X
దివంగత దిగ్గజ దర్శకుడు దాసరి నారాయణరావు చనిపోయినా కూడా ఆయన కుమారులు వివాదాలు వీడడం లేదు. తాజాగా ఆయన పేరు మరోసారి వార్తల్లోకి వచ్చింది. తాజాగా దాసరి కుమారుడు దాసరి అరుణ్ కుమార్ పై కేసు నమోదు కావడం చర్చనీయాంశమైంది. బంజారాహిల్స్ పీఎస్ లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. దాసరి నారాయణరావు తీసుకున్న అప్పు విషయంలో గొడవ జరిగినట్టు తెలుస్తోంది.

బొల్లారంలోని మారుతినగర్ కు చెందిన నర్సింహులు (41) అనే వ్యక్తి పాత సినిమాలో రిస్టోరేషన్ టెక్నీషియన్ గా పనిచేస్తున్నాడు. దాసరి బతికి ఉన్న సమయంలో ఆయన వద్ద 2012 నుంచి 2016 వరకు సినిమాల రిస్టోరేషన్ పనులను ఔట్ సోర్సింగ్ పద్ధతిలో చేశాడు. ఈ నేపథ్యంలో దాసరి నారాయణరావు మరణించిన అనంతరం కొన్ని పనులు బాకీ ఉన్నా వాటిని కూడా పలుమార్లు జూబ్లీహిల్స్ లోని దాసరి ఇంటికి వెళ్లి పనులు పూర్తి చేశాడు.

అయితే పనులు పూర్తి అయిన తర్వాత డబ్బులు ఇవ్వాల్సిన విషయంలో నర్సింహులకు, దాసరి నారాయణరావు కొడుకులు ప్రభు, అరుణ్ కుమార్ ల మధ్య గొడవలు మొదలయ్యాయి. అప్పటి నుంచి నర్సింహులు తనకు రావాల్సిన డబ్బుల కోసం అరుణ్ ను అడుగుతూనే ఉన్నాడు.

ఈ నేపథ్యంలోనే ఈనెల 13వ తేదీన నర్సింహులు ఫిలింనగర్ లోని ఎఫ్ఎన్.సీసీ వద్దకు రమ్మని చెప్పాడు. అక్కడికి నర్సింహులు రాగా దాసరి అరుణ్ కుమార్ తనను కులం పేరుతో దూషించాడని నర్సింహులు ఆరోపిస్తున్నాడు. ఈనెల 16న అరుణ్ పై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు.