Begin typing your search above and press return to search.

`అంట‌రాని త‌నం`పై షారుక్ - అట్లీ పోరాటం?

By:  Tupaki Desk   |   21 Sept 2021 5:00 AM IST
`అంట‌రాని త‌నం`పై షారుక్ - అట్లీ పోరాటం?
X
బాద్ షా షారుక్ ఖాన్ క‌థానాయ‌కుడిగా కోలీవుడ్ డైరెక్ట‌ర్ అట్లీ కుమార్ ఓ చిత్రాన్ని తెర‌కెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే. భారీ రివెంజ్ యాక్ష‌న్ ఎంట‌ర్‌ టైన‌ర్ గా ఈ చిత్రాన్ని మ‌లుస్తున్న‌ట్లు ఇప్ప‌టికే ప్ర‌చారంలో ఉంది. అంట‌రాని త‌నంపై షారుక్ చేసే పోరాటమే కంటెంట్ లో మెయిన్ థీమ్ అని స‌మాచారం. స‌మాజం నుంచి తాను ఎదుర్కొన్న స‌వాళ్ల‌పై షారుక్ ఎలా ప్ర‌తీకారం తీర్చుకున్నారు? అన్న పాయింట్ సినిమాలో హైలైట్ అవుతుంద‌నే ప్ర‌చారం సాగుతోంది. కీల‌క‌మైన పాత్ర‌ల్లో న‌య‌న‌తార‌.. ప్రియ‌మ‌ణి.. సన్యా మ‌ల్మోత్రా న‌టిస్తున్నారు. క‌థ‌లో ఈ పాత్ర‌లు ఎంతో బ‌లంగా క‌నిపిస్తాయ‌ని సొసైటీపై మ‌హిళ‌ల ప్ర‌భావం ఎలా ఉంద‌నే బ‌ల‌మైన పాత్ర‌ల్లోనే ఈ ముగ్గురు న‌టిస్తున్నార‌ని ప్ర‌చారం సాగుతోంది.

కంటెంట్ ప‌రంగా హైలైట్ గా ఉంటుంద‌ని కోలీవుడ్ వ‌ర్గాల్లో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. సందేశాత్మ‌క‌ క‌థ‌ను అట్లీ త‌న‌దైన శైలిలో క‌మ‌ర్శియ‌లైజ్ చేసి భారీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ గా మ‌లుస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో ఈ సినిమా మ‌రో త‌మిళ సినిమాకు రీమేక్ అని మ‌రో కొత్త ప్ర‌చారం కూడా తెర‌పైకి వ‌చ్చింది. నేచుర‌ల్ స్టార్ నాని క‌థానాయకుడిగా విక్ర‌మ్. కె. కుమార్ తెర‌కెక్కించిన ` గ్యాంగ్ లీడ‌ర్` చిత్రానికి అట్లీ సినిమా రీమేక్ కానీ ప్రీమేక్ కానీ అవుతుంద‌ని కొత్త ప్ర‌చారం తెర‌పైకి వ‌చ్చింది. మ‌రి ఇందులో నిజ‌మెంతో తెలియాలి. అయినా గ్యాంగ్ లీడ‌ర్ బాక్సాఫీస్ వ‌ద్ద స‌రైన ఫ‌లితాలు సాధించ‌లేదు. డివైడ్ టాక్ వ‌చ్చినా బాక్సాఫీస్ వ‌ద్ద యావ‌రేజ్ గా కూడా రాణించ‌లేదు.

ఈ నేప‌థ్యంలో అట్లీ ఈ క‌థ‌ను ఎందుకు రీమేక్ చేస్తాడు? అన్న విమ‌ర్శ ఉంది. ఇక బాద్ షా చిత్రానికి అట్లీ `ల‌య‌న్` అనే టైటిల్ ని అనుకుంటున్న‌ట్లు స‌మాచారం. పాన్ ఇండియా కేట‌గిరీ సినిమా కాబ‌ట్టి సౌత్ లో ఫేమ‌స్ ఆర్టిస్టుల్ని రంగంలోకి దించాల‌ని చూస్తున్నారు. దీనిలో భాగంగా కోలీవుడ్ స్టార్ ద‌ళ‌ప‌తి విజ‌య్ ని ప్ర‌త్యేక పాత్ర‌కు ఒప్పించే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయ‌ని స‌మాచారం. ప్ర‌స్తుతం షూటింగ్ ముంబైలో జ‌రుగుతొంది. చిత్రీక‌ర‌ణ ముందుగా పూణేలో ప్రారంభ‌మైంది. అక్క‌డ షెడ్యూల్ పూర్తి చేసుకున్న అనంత‌రం ముంబైకి షిప్ట్ అయ్యారు. ఇక షారుక్ స‌క్సెస్ అందుకుని చాలా కాల‌మ‌వుతోంది. ఈ నేప‌థ్యంలో అట్లీ ప్రాజెక్ట్ పై చాలా ఆశ‌లు పెట్టుకున్నారు. ఈచిత్రాన్ని షారుక్ సొంత నిర్మాణ సంస్థ రెడ్ చిల్లీ ఎంట‌ర్ టైన్ మెంట్ పై భారీ బ‌డ్జెట్ తో నిర్మిస్తున్నారు.

ఖాన్ కోసం ఇద్ద‌రు సంగీత ద‌ర్శ‌కులు?

కింగ్ ఖాన్ షారూక్ క‌థానాయ‌కుడిగా అట్లీ తెర‌కెక్కిస్తున్న తాజా చిత్రం జాతీయ స్థాయిలో చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ద‌శాబ్ధాల పాటు సాగిన‌ త‌న విజ‌య‌వంత‌మైన కెరీర్ లో ఏనాడూ షారూక్ ద‌క్షిణాది ద‌ర్శ‌కుల‌కు ప్రాధాన్య‌త‌నిచ్చిన‌ది లేదు. కానీ ఇప్పుడు ఖాన్ కూడా రూటు మార్చాడు. నేటిత‌రం ద‌ర్శ‌కుడు అట్లీ నిర్ధేశ‌నంలో భారీ చిత్రంలో న‌టిస్తున్నారు. దీనికోసం రెండేళ్లుగా ఎంతో గ్రౌండ్ వ‌ర్క్ జ‌రిగింది.

తాజా స‌మాచారం మేర‌కు ఈ సినిమాకి ఇద్దరు మ్యూజిక్ కంపోజర్ లు ప‌ని చేస్తార‌ని తెలిసింది. ఆస్కార్ గ్ర‌హీత ఏఆర్ రెహమాన్ పాటలు కంపోజ్ చేయ‌నుండ‌గా.. యువ సంచలనం అనిరుధ్ రవిచందర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కంపోజ్ చేస్తారు. ఏఆర్ రెహమాన్ ఇదివ‌ర‌కూ అట్లీతో కలిసి మెర్సల్ - బిగిల్ సినిమాలకు పనిచేశారు. అతను దిల్ సే - జబ్ తక్ హై జాన్ వంటి సినిమాలకు షారుఖ్ తో కలిసి పనిచేశాడు. మరో వైపు SRK అట్లీ ఇద్దరితో అనిరుధ్ కు ఇది మొదటి సినిమా. ఇందులో షారూఖ్ ద్విపాత్రాభినయం చేయ‌నున్నార‌ని తెలుస్తోంది. నయనతార- ప్రియమణి- సన్యా మల్హోత్రా- సునీల్ గ్రోవర్ -యోగి బాబు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.

వ‌ల‌స‌దారుల‌పైనా ఖాన్ ప్ర‌యోగం:

వార్ ఫేం సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న పఠాన్ లో షారూక్ విభిన్న‌మైన గెట‌ప్ తో క‌నిపించ‌నున్నారు. దీపికా పదుకొనే- జాన్ అబ్రహం ఇందులో ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. రాజ్ కుమార్ హిరాణీతో వ‌లస‌దారుల‌పై భారీ చిత్రం చేయ‌నున్నారు. క‌రోనాలో ప్ర‌భుత్వాలు విదిలించి కొట్టిన వ‌ల‌స‌దారుల పాట్ల‌పై హిరాణీ క‌థాంశాన్ని రెడీ చేసుకున్నార‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.