Begin typing your search above and press return to search.

క్ష‌మించండి...ఆ సీన్ల‌ను తొల‌గిస్తా: హీరోయిన్‌

By:  Tupaki Desk   |   9 Nov 2017 6:53 PM IST
క్ష‌మించండి...ఆ సీన్ల‌ను తొల‌గిస్తా: హీరోయిన్‌
X

ద‌క్షిణాదిలో కొంద‌రు హీరోయిన్లు త‌మ మొద‌టి సినిమాలో చాలా ప‌ద్ధ‌తిగా - ల‌క్ష‌ణంగా - సంప్ర‌దాయ బ‌ద్ధంగా న‌టించిన ప్రేక్ష‌కుల మ‌న‌సును దోచేస్తారు. ఆ త‌ర్వాతి సినిమాలో గ్లామ‌ర్ డోస్ పెంచేస్తుంటారు. అదే కోవ‌లో కోలీవుడ్ హీరోయిన్ అతుల్య ర‌వి చేరిపోయింది. కాదల్ కన్‌ కట్టుదే చిత్రంలో ప‌ద్ధ‌తిగా నటించిందంటూ విమర్శకుల‌ ప్రశంసలు అందుకున్న అతుల్య...త‌న నెక్స్ట్ మూవీలో అందాల‌ను ఓ రేంజ్ లో ఆర‌బోసింది. ఆమె నటించిన తాజా చిత్రం యెమాలి టీజర్ లో అమ్మ‌డి ఎక్స్ పోజింగ్ పీక్స్ లో ఉండ‌డంతో ఆమెను అభిమానించిన వారు షాక్ అయ్యారు. పొట్టి బట్టలు - అసభ్య సైగలు - మందు-సిగరెట్‌ తాగటం - హాట్ సీన్లలో రెచ్చిపోవటం వంటివి చూసిన అభిమానులు ఆశ్చ‌ర్య‌పోతున్నారు. ఆ సినిమాలో అతుల్యేనా ఈ సినిమాలో న‌టించింది అని అవాక్క‌వుతున్నారు.

అభిమానులు సోషల్ మీడియాలో అతుల్యను ట్రోల్ చేస్తున్నారు. ఆమెను అసభ్య పదజాలంతో దూషిస్తూ మెసేజులు పెడుతున్నారు. ఈ వ్య‌వ‌హారం ముదిరేట్లుంద‌ని భావించిన అతుల్య ఆ సీన్లపై వివ‌ర‌ణ ఇస్తూ త‌న ఫేస్ బుక్ పేజీలో ఓ పోస్ట్ పెట్టింది. టీజర్లో తన పాత్ర‌ను చూసి తప్పుగా అనుకోవద్దని - సినిమాలో త‌న క్యారెక్ట‌ర్ కు త‌గ్గ‌ట్లుగా తాను అలా నటించాల్సి వచ్చిందని క్లారిటీ ఇచ్చే ప్ర‌య‌త్నం చేసింది. క‌థ డిమాండ్ చేయ‌డంతో ఆ సన్నివేశాల‌ చిత్రీకరణ జరిగింద‌ని చెప్పింది. సినిమాలో ఆ సన్నివేశాలు ఉండబోవని స్ప‌ష్టం చేస్తూ తన అభిమానుల‌కు క్షమాపణలు చెప్పింది. ఆ సీన్ల‌ను తొల‌గించాల‌ని ఇప్పటికే దర్శకుడికి ఆమె విజ్ఞప్తి కూడా చేసినట్లు తెలుస్తోంది. అయితే, ఆ సీన్ల‌కు అంత ప‌బ్లిసిటీ వ‌చ్చాక వాటిని తొల‌గిస్తారా? అన్న‌ది తేలాల్సి ఉంది.