Begin typing your search above and press return to search.

ప్రియుడితో ఉన్నారా? అంటూ స్టార్ డాట‌ర్ ని నిల‌దీసిన నెటిజ‌నం

By:  Tupaki Desk   |   12 Jun 2021 3:30 AM GMT
ప్రియుడితో ఉన్నారా? అంటూ స్టార్ డాట‌ర్ ని నిల‌దీసిన నెటిజ‌నం
X
భారత క్రికెటర్ కె.ఎల్.రాహుల్ తో కలిసి అందాల క‌థానాయిక‌ ఆతియా శెట్టి ఇంగ్లండ్ కు వెళ్లారా? ప్ర‌స్తుతం అభిమానుల మ‌ధ్య ఆస‌క్తిక‌ర డిబేట్ ఇది. ఆతియా మంగళవారం ఇన్ స్టాగ్రామ్ లో బ్లాక్ అండ్ వైట్ ఫోటోని షేర్ చేయడంతో ఈ ప్రశ్న త‌లెత్తింది. ఈ ఫోటోలో అతియా బారికేడ్లతో ఉన్న‌ బహిరంగ మైదానంలో కూర్చుని కనిపించింది. ``మీ శక్తిని కాపాడుకోండి`` అనే క్యాప్షన్ ని ఆథియా ఇచ్చింది.

దీనికి స్పందిస్తూ ఆతియాని అభిమానులు ర‌క‌ర‌కాలుగా ప్ర‌శ్నించారు. ``రాహుల్ తో ఉన్నారా? అంటూ సూటిగా ప్ర‌శ్నించారు. ``మీరు kl సార్ ఉన్న చోట ఉన్నారా?`` అడిగాడు ఓ అభిమాని. బ్లాక్ అండ్ వైట్ పిక్చర్ కాబట్టి మనకు నేపథ్యం కనిపించదు.. అని మరొకరు వ్యాఖ్యానించారు.

``రాహుల్ అదే ప్రదేశంలో ఒక ఫోటో దిగి క‌నిపించారు`` అంటూ మ‌రో వ్య‌క్తి డిబేట్ ని కొన‌సాగించాడు. కెఎల్ రాహుల్ ఆ ఫోటోల్ని షేర్ చేసాడ‌ని అత‌డు గెస్ చేశాడు. మొత్తానికి ప్రేయ‌సీ ప్రియులు ఒకే టూర్ లో ఉన్నార‌నేది నెటిజ‌నుల వాద‌న‌. కానీ దానికి ఆతియా నుంచి రిప్ల‌య్ లేదు.

జూన్ 18 న సౌతాంప్టన్ లోని అగాస్ బౌల్ లో జరగనున్న న్యూజిలాండ్ తో జ‌ర‌గ‌నున్న‌ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్స్ కు కెఎల్ రాహుల్ విరాట్ కోహ్లీ భారత క్రికెట్ జట్టు ఇంగ్లండ్ లో ఉన్నారు. విరాట్ జట్టుకు మద్దతుగా నటి అనుష్క శర్మ కూడా ఇంగ్లాండ్ లో ఉన్నారు.

అతియా- రాహుల్ జంట అక్క‌డ ఉన్నారా? అయినా ఆ ఇద్ద‌రూ ఏనాడూ తమ సంబంధం గురించి అధికారికంగా మాట్లాడలేదు. దీనిపై ఆతియా శెట్టి తండ్రి స్టార్ హీరో సునీల్ శెట్టి కూడా ఎలాంటి హింట్ ఇవ్వ‌డం లేదు. ఇక ఆ ఇద్దరూ ఒకరిపై ఒకరు సోషల్ మీడియాల్లో ప్రేమ‌ను చూపిస్తున్నారు. ఆతియా తన పుట్టినరోజు సందర్భంగా ఏప్రిల్ లో కె.ఎల్ రాహుల్ తో క‌లిసి ఉన్న కొన్ని ఫోటోల్ని పంచుకున్నారు. అది మాత్ర‌మే ఈ జంట ప్రేమ‌కు హింట్ గా నిలిచింది.