Begin typing your search above and press return to search.

కమెడియన్ ని రిక్వెస్ట్ చేసిన హీరో

By:  Tupaki Desk   |   19 Sept 2019 12:40 PM IST
కమెడియన్ ని రిక్వెస్ట్ చేసిన హీరో
X
రేపు విడుదల కాబోతున్న వరుణ్ తేజ్ వాల్మీకి మీద మెగా ఫాన్స్ లో అంచనాలు భారీగా ఉన్నాయి . మొదటిసారి మెగా ప్రిన్స్ చేసిన మాస్ పాత్ర కావడంతో సాలిడ్ హిట్ ఖాయమనే నమ్మకంతో ఉన్నారు. ఇందులో తమిళ హీరో అధర్వా ఒరిజినల్ వెర్షన్ లో సిద్దార్థ్ చేసిన రోల్ పోషించిన సంగతి తెలిసిందే. మనవాళ్ళకు పరిచయం లేకపోయినా ఇతగాడికి కోలీవుడ్ లో డీసెంట్ మార్కెట్ ఉంది. ఇక్కడ కూడా దీని ద్వారా మంచి డెబ్యు చేద్దామనే ఆలోచనలో ఉన్నాడు.

ఇందులో తనతో కూడా ఉండే అసిస్టెంట్ పాత్రలో కమెడియన్ సత్య పండించిన హాస్య ఓ రేంజ్ లో వచ్చిందని ఇన్ సైడ్ టాక్. అధర్వా పక్కనే ఉంటూ పంచ్ డైలాగులతో తన విభిన్నమైన బాడీ లాంగ్వేజ్ తో ఆద్యంతం డామినేట్ చేసే స్థాయిలో సాగిందట. ఒకదశలో సత్య టైమింగ్ చూసి అధర్వా సర్ ప్లీజ్ నన్ను డామినేట్ చేయకండి అని రిక్వెస్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయట. తెలుగు బాష మీద అవగాహన లేకపోవడంతో దర్శకుడు హరీష్ శంకర్ చెప్పింది చేయడం తప్ప అధర్వకు ఇంకో ఆప్షన్ లేదు.

కాని సత్య తనదైన శైలిలో నవ్వులు పూయించే పనిలో టాలెంట్ చూపడంతో ఈ పరిస్థితి వచ్చిందట. ఏదైతేనేం ఒకవేళ ఈ ట్రాక్ కనక బాగా పండితే సత్య ఇంకా బిజీగా మారడం ఖాయమని యూనిట్ మాట. ఇప్పటికే మిక్కి జే మేయర్ మాస్ ట్యూన్స్ ఆడియో పరంగా సక్సెస్ అందుకున్నాయి. మరి కంటెంట్ కూడా అదే స్థాయిలో కుదిరితే వరుణ్ తేజ్ ఎఫ్2 తర్వాత మరో సక్సెస్ కొట్టేసినట్టే.