Begin typing your search above and press return to search.

వాజ్‌ పేయ్ క‌విత‌లు సినిమా పాట‌లుగా..

By:  Tupaki Desk   |   16 Aug 2018 4:43 PM GMT
వాజ్‌ పేయ్ క‌విత‌లు సినిమా పాట‌లుగా..
X
మాజీ ప్రధాని వాజ్‌ పేయ్ గొప్ప నాయకుడు. అంత‌కుమించి అత‌డు క‌వి. అత‌డిలోని కవితాత్మ‌క హృద‌యంపైనా సినీప‌రిశ్ర‌మ‌ల్లో ప‌లు సంద‌ర్భాల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగింది. వాజ్‌ పేయ్ గొప్ప క‌వి. క‌థ‌కుడు. అతడు రాసిన ఎన్నో కవితలు బాలీవుడ్ లో పాటలుగా మారి శ్రోతలను అలరించాయి. వాటిని ప్ర‌ఖ్యాత గాయ‌నీగాయ‌కులు ఆల‌పించారు. వాటిలో కొన్నిటిని ప‌రిశీలిస్తే..

క్యా ఖోయా క్యా పాయా.. ఎంతో విన‌సొంపైన ప‌ద‌జాలం ఉన్న ఈ క‌విత బాలీవుడ్ పాట‌గా మారింది. అటల్ బిహారీ వాజ్‌పేయ్ ప‌ద‌లాలిత్య ంపై నాడు ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగింది. దివంగత సింగర్ శ్రీ జగ్జిత్ సింగ్ ఈ పాట‌ను ఆల‌పించారు. 1999లో బాద్‌ షా షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన సినిమాలో ఈ పాట నాడు యువ‌త‌రాన్ని మెప్పించింది. వాజ్‌ పేయ్ క‌వితాత్మ‌క ప‌ద‌జాలం - జగ్జిత్ సింగ్ గానాలాప‌న‌ - షారుఖ్ ఖాన్ విజువ‌ల్ బ్రిలియ‌న్సీ వెర‌సి.. ఈ పాటను మేటి క్లాసిక్‌ గా నిల‌బెట్టాయి.

దూర్ కహి కోయి రోతా హై.. ఈ పాటను కూడా ప్ర‌ఖ్యాత గాయ‌కుడు జగ్జిత్ సింగ్ పాడారు. ఈ కవిత సామవేదన ఆల్బమ్ లో భాగం. సంతోషంతో పాటు జీవితంలో బాధ - ఒంటరితనం అన్నీ ఉండాలని చెప్పే ఈ పాట 2002లో ప్ర‌జ‌ల‌ హృదయాల్లో నిలిచిపోయింది. ఇప్ప‌టికీ ఈ క్లాసిక్ ముంబై ఎఫ్ ఎం రేడియోల్లో వినిపిస్తూ ఉంటుంది. ఝుకి నా ఆల్కేన్.. అంటూ సాగే పాట‌కు వాజ్‌ పేయ్ లిరిక్ అందించారు. ఈ పాటను కూడా జగ్జిత్ సింగ్ ఆల‌పించ‌గా.. 1999లో ఈ పాట శ్రోత‌ల్ని విశేషంగా అల‌రించింది.