Begin typing your search above and press return to search.

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఏ స్టేజ్‌ లో ఉన్నాడు..?

By:  Tupaki Desk   |   29 Dec 2020 11:10 AM GMT
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఏ స్టేజ్‌ లో ఉన్నాడు..?
X
అక్కినేని అందగాడు అఖిల్ అక్కినేని నటిస్తున్న తాజా చిత్రం ''మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్''. 'బొమ్మరిల్లు' భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో గీతాఆర్ట్స్2 బ్యానర్‌ పై బన్నీ వాస్ - వాసు వర్మ కలిసి నిర్మిస్తున్నారు. ఈ రొమాంటిక్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. గోపీ సుందర్ సంగీతం సమకూరుస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ మరియు టీజర్ ఆకట్టుకున్నాయి. అలానే 'మనసా మనసా' లిరికల్ సాంగ్ కూడా విశేష ఆదరణ దక్కించుకుని ఈ ఏడాది బెస్ట్ సాంగ్స్ లో ఒకటిగా నిలిచింది. ఈ సినిమాతో అఖిల్ - భాస్కర్ బౌన్స్ బ్యాక్ అవుతారని అందరూ నమ్మకంగా ఉన్నారు. కరోనా లాక్‌ డౌన్‌ కారణంగా నిలిచిపోయిన ఈ చిత్ర షూటింగ్ ని తిరిగి ప్రారంభించారు.

'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్' చిత్రాన్ని 2021 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్స్ చేశారు. కానీ ఈ ఆ తర్వాత బ్యాచిలర్ నుంచి ఎలాంటి అప్డేట్ రాలేదు. కోవిడ్ నేపథ్యంలో థియేటర్స్ రీ ఓపెన్ చేస్తున్నప్పటికీ ఈ సినిమా విడుదలపై క్లారిటీ ఇవ్వలేదు. అందరూ ఏదొక అప్డేట్ ఇస్తూ హడావిడి చేస్తుంటే బ్యాచిలర్ మాత్రం సైలెంటుగా ఉన్నాడు. ఇకపోతే ఈ సినిమా బడ్జెట్ ముందు అనుకున్న దానికంటే ఎక్కువైందని.. కరోనా టైంలో ఈ మూవీ అంత బిజినెస్ చేస్తుందా అని మేకర్స్ ఆలోచిస్తున్నారని టాక్ నడుస్తోంది. సెకండాఫ్ లోని కొన్ని సన్నివేశాలను రీ షూట్ చేయడం వల్లనే బడ్జెట్ పెరిగిందని అంటున్నారు. సీనియర్ ప్రొడ్యూసర్ అయిన అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని ఎప్పుడు తీసుకొస్తాడో చూడాలి. '100% లవ్' సినిమాతో నాగచైతన్య ని గాడిలో పెట్టిన మెగా ప్రొడ్యూసర్ 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్' చిత్రంతో సక్సెస్ ట్రాక్ ఎక్కిస్తాడని అభిమానులు నమ్మకంగా ఉన్నారు.