Begin typing your search above and press return to search.

ఎట్టకేలకు 'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి' వచ్చారు 

By:  Tupaki Desk   |   2 Jan 2023 6:47 AM GMT
ఎట్టకేలకు ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి వచ్చారు 
X
యంగ్ హీరో నాగ శౌర్య.. ట్యాలెంటెడ్ డైరెక్టర్ అవసరాల శ్రీనివాస్ కాంబినేషన్‌ లో రూపొందిన ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి సినిమా షూటింగ్ పూర్తి అయినట్లుగా ప్రకటించి చాలా నెలలు అయ్యింది. షూటింగ్ ముగించి సినిమాను విడుదల చేయడం లేదు ఏంటో అంటూ ఇటీవలే మనం చర్చించుకున్నాం. ఎట్టకేలకు ఈ సినిమా యొక్క ఫస్ట్‌ లుక్ ను రివీల్ చేశారు.

ఈ సినిమాలో నాగ శౌర్య కి జోడీగా మాళవిక నాయర్ హీరోయిన్ గా నటించింది. రచన మరియు దర్శకత్వం అవసరాల శ్రీనివాస్ అందించగా మోస్ట్‌ హ్యాపెనింగ్‌ ప్రొడక్షన్‌ హౌస్‌ పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ వారు ఈ సినిమాను దాసరి ప్రొడక్షన్స్ వారితో కలిసి నిర్మించి విడుదల చేయబోతున్నారు.

గత ఏడాది పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వారు వరుస సినిమాలతో సక్సెస్ దక్కించుకున్న నేపథ్యంలో ఈ సినిమా వారి బ్యానర్‌ లో అవ్వడం వల్ల క్రేజ్ మరింత పెరగడం ఖాయం అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు కామెంట్స్ చేస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్‌ లుక్ అయితే విడుదల చేశారు కానీ ఇప్పటి వరకు సినిమా యొక్క విడుదల తేదీ విషయంలో స్పష్టత ఇవ్వలేదు.

ఒక విభిన్నమైన కాన్సెప్ట్‌ మరియు ప్రేమ కథ ఆధారంగా ఈ సినిమా రూపొందినట్లుగా యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. నటుడిగా ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించిన అవసరాల శ్రీనివాస్ రచయితగా.. దర్శకుడిగా చేసిన సినిమాలు తక్కువే అయినా కూడా మంచి మార్కులను దక్కించుకున్నాడు.

దర్శకుడిగా ఆయన చేసిన సినిమాలు మంచి విజయాలను సొంతం చేసుకున్న నేపథ్యంలో ఈ సినిమా కూడా తప్పకుండా ఆకట్టుకుంటుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది. నాగ శౌర్య కూడా విభిన్నమైన సినిమాలను ఎంపిక చేసుకుంటున్న అందరికి తెలిసిందే.

చాలా ఇంట్రెస్టింగ్‌ కాంబినేషన్ లో రూపొందిన ఈ సినిమాకు కళ్యాణి మాళిక్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రానికి దర్శకత్వం వహించడంతో పాటు అవసరాల కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ఇంకా ఈ సినిమాలో మేఘా చక్రవర్తి.. అశోక్ కుమార్‌.. అభిషేక్ మహర్షి.. శ్రీవిద్య తదితరులు ముఖ్య పాత్రలో కనిపించబోతున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.