Begin typing your search above and press return to search.

పెళ్లి సందడి జంటతో అశ్వినీదత్‌ రిస్క్‌

By:  Tupaki Desk   |   17 Feb 2022 4:30 AM GMT
పెళ్లి సందడి  జంటతో అశ్వినీదత్‌ రిస్క్‌
X
సినిమా ఇండస్ట్రీలో కొన్ని సార్లు రిస్క్ తీసుకుని చేసిన సినిమాలు సూపర్ డూపర్ హిట్‌ గా నిలిచాయి. ప్రముఖ నిర్మాతలు మరియు దర్శకులు ఏదో ఒక సందర్బంలో రిస్కీ ప్రాజెక్ట్‌ లు చేసిన వారే. రిస్క్‌ చేసిన వారు సక్సెస్ లు మాత్రమే కాకుండా ప్రశంసలు దక్కించుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు అదే రిస్క్ ను అశ్వినీదత్‌ చేయబోతున్నాడని సమాచారం అందుతోంది.

సుదీర్ఘ కాలం పాటు నిర్మాణ రంగంలో ఉన్న అశ్వినీదత్‌ సినీ కెరీర్ లో ఎన్నో సార్లు ప్రయోగాలు చేశాడు. ఆయన చేసిన ప్రయోగాలు కొన్ని ప్లాప్ అయ్యి నష్టాలను మిగల్చగా కొన్ని సూపర్‌ డూపర్ హిట్ అయ్యి లాభాల పంట పండించాయి అనడంలో సందేహం లేదు. ఇప్పుడు అశ్వినీదత్ మరోసారి ప్రయోగానికి సిద్దం అవుతున్నాడని వార్తలు వస్తున్నాయి. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారంపెళ్లి సందడి కాంబోను ఈయన రిపీట్ చేయబోతున్నాడట.

రాఘవేంద్ర రావు నిర్మాణంలో రూపొందినపెళ్లి సందడి సినిమా తో హీరోగా రోషన్‌ మరియు హీరోయిన్ గా శ్రీలీల పరిచయం అయ్యారు. వీరిద్దరు కూడా మొదటి సినిమా తో కమర్షియల్‌ గా సక్సెస్ దక్కించుకోలేక పోయారు. కాని రోషన్‌ చూడ్డానికి బాలీవుడ్‌ హీరో మాదిరిగా ఉన్నాడని.. మంచి భవిష్యత్తు ఉన్న హీరో అంటూ టాక్ దక్కించుకున్నాడు. ఇక శ్రీలీల అందంతో ఆకట్టుకుని ఇప్పటికే బిజీ అయ్యింది. మంచి పారితోషికంతో పాటు వరుస ఆఫర్లు దక్కించుకుంటుంది.

మళ్లీ వీరిద్దరి కలయికలో ఒక సినిమా రాబోతున్నట్లుగా తెలుస్తోంది.. వీరిద్దరి కాంబోలో సినిమా అంటేనే రిస్క్‌ అది కాకుండా.. వీరిద్దరి కోసం దాదాపుగా 20 కోట్లను పెట్టేందుకు అశ్వినీదత్ సిద్దం అయ్యాడట. ఇది ఖచ్చితంగా పెద్ద రిస్క్‌ అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు. ఇంకా అధికారిక ప్రకటన రాని ఈ సినిమా గురించి ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో రకరకాలుగా చర్చించుకుంటున్నారు.

పెళ్లి సంద‌D సినిమా పది కోట్ల లోపు బడ్జెట్‌ తో పూర్తి అయ్యిందట. కాని ఇప్పుడు వీరిపై అశ్వినీదత్ అంత ఖర్చు చేయడం కాస్త ఆశ్చర్యంగా ఉందంటున్నారు. అది కూడా కొత్త దర్శకుడితో ఈ సినిమా రూపొందబోతున్నట్లుగా తెలుస్తోంది. అశ్వినీదత్‌ కథపై నమ్మకంతో పాటు మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ మరియు ఆయన కూతుర్లు సినిమా కు వెనుక ఉంటున్న కారణంగా విజయం వస్తుందనే నమ్మకంతో ఆ బడ్జెట్‌ కు సిద్దం అయ్యారని తెలుస్తోంది.

మొదటి సినిమా తో ఈ కాంబో ప్లాప్ అయినా కూడా చక్కగా కలర్‌ ఫుల్‌ జంటగా మాత్రం నిలిచారు అనడంలో సందేహం లేదు. ఇద్దరు కూడా స్టార్‌ హీరో హీరోయిన అయ్యేంత అందం మరియు ప్రతిభ ఉన్న వారే. కనుక ఈ రెండవ అవకాశం వీళ్లకు ఖచ్చితంగా కలిసి వస్తుందనే నమ్మకంతో అంతా ఉన్నారు. రోషన్‌ హీరోగా మరింత గా రాణించేందుకు ప్రస్తుతం శిక్షణ తీసుకుంటున్నాడట. ఇక శ్రీలీల బిజీ బిజీగా ఇప్పటికే కుమ్మేస్తుంది. కనుక వీరి రెండవ సినిమా అతి త్వరలోనే షురూ అవుతుందేమో చూడాలి.