Begin typing your search above and press return to search.

మెగా ఫ్యాన్స్‌ ఎదురు చూస్తున్న గుడ్‌ న్యూస్‌ చెప్పిన అశ్వినీదత్‌

By:  Tupaki Desk   |   7 May 2020 1:00 PM IST
మెగా ఫ్యాన్స్‌ ఎదురు చూస్తున్న గుడ్‌ న్యూస్‌ చెప్పిన అశ్వినీదత్‌
X
చిరంజీవి కెరీర్‌ లో మాత్రమే కాకుండా తెలుగు సినిమా చరిత్రలో నిలిచి పోయే సినిమా జగదేక వీరుడు అతిలోక సుందరి. ఈ చిత్రం ఒక అద్బుతమైన దృశ్యకావ్యం. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో మెగానిర్మాత అశ్వినీదత్‌ నిర్మించిన ఈ చిత్రం విడుదలై 30 ఏళ్లు అవుతుంది. ఈ సందర్బంగా గత రెండు మూడు రోజులుగా సోషల్‌ మీడియాలో ఈ సినిమాకు సంబందించిన ముచ్చట్లే వినిపిస్తున్నాయి. చిరంజీవి.. శ్రీదేవి జంటగా నటించిన జగదేవక వీరుడు అతిలోక సుందరి చిత్రం సీక్వెల్‌ లేదా రీమేక్‌ చేయాలంటూ మెగా ఫ్యాన్స్‌ కోరుకుంటున్నారు. చరణ్‌ ఆ సినిమా చేస్తే చూడాలని మెగా ఫ్యాన్స్‌ చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు.

తాజాగా ఆ సినిమా 30 ఏళ్ల ప్రస్థానం నేపథ్యంలో ఒక మీడియా సంస్థకు నిర్మాత అశ్వినీదత్‌ ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు. అదే సమయంలో ఖచ్చితంగా జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రంకు సీక్వెల్‌ ఉంటుందని ప్రకటించాడు. ఆ సీక్వెల్‌ చేసిన తర్వాతే సినిమా ఇండస్ట్రీ నుండి నేను తప్పుకుంటాను అన్నాడు. సీక్వెల్‌ ఆలోచన తనకు కూడా ఉందంటూ అశ్వీనీదత్‌ ప్రకటించడంతో మెగా ఫ్యాన్స్‌ ఆనందంకు హద్దులు లేవు.

సీక్వెల్‌ అంటూ తీస్తే అది ఖచ్చితంగా చరణ్‌ తో మాత్రమే సాధ్యమని.. చరణ్‌ చేస్తేనే ప్రేక్షకులు చూస్తారంటూ అప్పుడే ఫ్యాన్స్‌ లో చర్చ మొదలైంది. జగదేక వీరుడి కొడుకు చరణ్‌.. అతిలోక సుందరి కూతురు జాన్వీ కపూర్‌ లు కలిసి సీక్వెల్‌ చేస్తే ఖచ్చితంగా అది అసలైన సీక్వెల్‌ అవుతుందని.. మరో అద్బుతమైన దృశ్యకావ్యంగా జగదేక వీరుడు అతిలోక సుందరి సీక్వెల్‌ అవుతుందంటూ నెట్టింట జనాలు కామెంట్స్‌ చేస్తున్నారు. మరి అశ్వినీదత్‌ మనసులో ఎవరు ఉన్నారో.. సీక్వెల్‌ కు దర్శకత్వం వహించే బాధ్యతను ఎవరు నెత్తిన పెట్టుకుంటారో తెలియాలంటే మరికొంత కాలం వెయిట్‌ చేయాల్సిందే.