Begin typing your search above and press return to search.

వెంకీ రీమేక్ సినిమా కు టైటిల్ అదేనా ?

By:  Tupaki Desk   |   21 Jan 2020 7:14 AM GMT
వెంకీ రీమేక్ సినిమా కు టైటిల్ అదేనా ?
X
ప్రస్తుతం తమిళ్ సూపర్ హిట్ సినిమాలు తెలుగులో రీమేక్ అవుతున్నాయి. అందులో ధనుష్ 'అసురన్' ఒకటి . గతేడాది కోలీవుడ్ బాక్సాఫీస్ ను షేక్ చేసిన 'అసురన్' ను తెలుగులో విక్టరీ వెంకటేష్ రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్ లో తెరకెక్కనున్న ఈ సినిమాకు సంబంధించి మరో రెండు రోజుల్లో అనంతపురంలో షూటింగ్ మొదలవుతుంది.

ఈ సినిమాకు లేటెస్ట్ గా 'నారప్ప' అనే టైటిల్ ని పరీశిలిస్తున్నారట మేకర్స్. వెంకటేష్ పాత్ర పేరు కావడంతో ఈ టైటిల్ నే ఫిక్సయినట్టు తెలుస్తుంది. అయితే ఈ టైటిల్ తెలుగు ప్రేక్షకులకు ఎంత వరకూ కనెక్ట్ అవుతుందా అనే ఆలోచనలో కూడా ఉన్నారట మేకర్స్. ఇక సినిమాలో వెంకటేష్ భార్య పాత్రలో ప్రియమణి నటించనుంది. తెలుగు నేటివిటీ కి తగ్గట్టు గా కొన్ని మార్పులతో ఈ రీమేక్ ను రూపొందించనున్నారు.

నేచురాలిటీకి దగ్గర గా ఉండే రీవెంజ్ కథ కావడం పైగా విలేజ్ సినిమాలకు కేరాఫ్ అడ్రెస్ అయిన శ్రీకాంత్ అడ్డాల డీల్ చేస్తుండడంతో ఈ రీమేక్ సినిమా పై భారీ అంచనాలు నెలకొంటున్నాయి. మరి ధనుష్ బ్లాక్ బస్టర్ అందుకున్న సినిమాతో వెంకీ బాక్సాఫీస్ దగ్గర ఎంత వసూళ్లు చేస్తాడో చూడాలి.