Begin typing your search above and press return to search.

మ‌ళ్లీ చెల‌రేగిన మ‌లైకా అరోరా

By:  Tupaki Desk   |   11 Dec 2021 6:00 AM IST
మ‌ళ్లీ చెల‌రేగిన మ‌లైకా అరోరా
X
బాలీవుడ్ హాట్ బ్యూటీ మ‌లైకా అరోరా సోష‌ల్ మీడియాల్లో ఎంత స్పీడ్ గా ఉంటారో తెలిసిందే. ఫ్యాష‌న్ అలాగే ఫిట్ నెస్ ఔత్సాహికుల‌కు బోలెడ‌న్ని టిప్స్ ని అందిస్తూనే త‌న ఫాలోయింగ్ ని పెంచుకుంది మ‌లైకా. ఇటీవ‌లే ఈ బ్యూటీ ప్రియుడు అర్జున్ క‌పూర్ తో మాల్దీవుల‌కు వెళ్లొచ్చిన సంగ‌తి తెలిసిందే.

ప్రియుడితో మాల్దీవుల అందాల్ని ఆస్వాధిస్తోన్న ఫోటోల్ని ఇన్ స్టా వేదిక‌గా షేర్ చేసింది. యాభైకి చేరువ‌లో ఉన్నా ఈ భామ ముప్పై ఏజ్ ప్రియుడితో రొమాన్స్ చేయ‌డంపై నిరంత‌రం యువ‌త‌రం హాట్ కామెంట్ల‌తో చెల‌రేగుతున్న సంగ‌తి తెలిసిన‌దే.

మాల్దీవుల విహారంలో ఈ జంట మ‌రోసారి రొమాంటిక్ గా రెచ్చిపోయింది. విమ‌ర్శ‌ల్ని కేర్ చేయ‌కుండా హ‌ద్దులు మీరారు. ఇదే మీకు కౌంట‌ర్ ..విమ‌ర్శ‌ల‌కు స‌మాధానం అంటూ నోళ్లు మూయించే ప్ర‌య‌త్నం చేసారు.

ఆ సంగ‌తిని ప‌క్క‌నబెడితే.. తాజాగా మ‌లైకా అరోరా మ‌రోసారి కొత్త ఫోటో షూట్ లో చెల‌రేగింది. చిరుత పులి ఛ‌ర్మం లుక్ లో డిజైన్ చేసిన‌ దుస్తుల్లో మ‌లైకా అందాల్ని హైలైట్ చేసింది.

ఆయిలీ టోన్డ్ బాడీ తో చూప‌రుల‌ను ఆక‌ట్టుకుంటోంది. అలాగే మ‌రో ఫోజ్ లో మిరిమిట్లు గొలిపే డార్క్ బ్లూ క‌ల‌ర్ దుస్తుల్లోనూ కెమారాకి ఫోజులిచ్చింది. ప్ర‌స్తుతం ఈ ఫోటోలు ఇన్ స్టాలో వైర‌ల్ గా మారాయి.

మ‌లైకా అభిమానులు హాట్ కామెంట్ల‌తో త‌మ‌దైన శైలిలో పోస్టులు పెడుతున్నారు. వ‌య‌సు మీద ప‌డినా అందాల ఎర‌తో ఆ వ‌య‌సునే దాచేస్తుందంటూ ఓ అభిమాని కామెంట్ చేసాడు.

ఇక ఇద్ద‌రి వృత్తిగ‌త విష‌యానికి వ‌స్తే అర్జున్ క‌పూర్ న‌టుడిగా బిజీగా ఉన్నాడు. ప్ర‌స్తుతం డ‌జ‌ను సినిమాలు చేతిలో ఉన్నాయి. అలాగే మ‌లైకా అరోరా కెరీర్ మాత్రం డ‌ల్ గానే సాగుతోంది. వ‌య‌సు మీద ప‌డ‌టంతో పెద్ద‌గా అవ‌కాశాలు రాలేదు.

ఆమె సినిమాలు చేసి మూడేళ్లు అవుతుంది. టెలివిజ‌న్ షో ల‌తో మాత్రం బిజీగానే గ‌డుపుతోంది. వెబ్ సిరీస్ ల‌వైపు ప్ర‌య‌త్నాలు చేస్తున్నా అక్క‌డా వ‌య‌సు అడ్డంకిగా మారింది.