Begin typing your search above and press return to search.
రామ్ చరణ్ ఆస్టన్ మార్టిన్ అదిరింది కదూ!
By: Tupaki Desk | 11 Oct 2020 5:21 PM ISTఖరీదైన స్పోర్ట్స్ కార్ లు అంటే ఇష్టపడేవాళ్లలో మెగాస్టార్ చిరంజీవి వారసుడు రామ్ చరణ్ కూడా ఉన్నారు. టాలీవుడ్ లో అక్కినేని నాగార్జునకు వింటేజ్ కార్లను సేకరించే హ్యాబిట్ ఉందని విన్నాం. నాగచైతన్య కు షోరూమ్ కి వచ్చిన ప్రతి కార్ ని రైడ్ చేయాలన్న పంతం ఉంది. ఇంకా టాలీవుడ్ లో చాలామంది హీరోలు స్పోర్ట్స్ బైక్ లు కార్లను అమితంగా ఇష్టపడతారు.
మరి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి ఏది ఇష్టం? అంటే... ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఆస్టన్ మార్టిన్ వింటేజ్ కార్. డార్క్ బ్లూ కలర్ లో ఆస్టన్ మార్టిన్ రయ్ మని రోడ్ పై దూసుకుపోతుంటే ఆ సీనే వేరుగా ఉంది కదూ? చరణ్ బయటకు వెళుతూ ఉంటే చుట్టూ గార్డ్ లు కార్ డ్రైవర్ అలెర్ట్ అయిపోయారు. అసలే వింటేజ్ కార్ కావడంతో దాని లుక్కే వేరే లెవల్లో ఉంది. ఇక చెర్రీకి ఈ కార్ తో పాటు బెంజ్ .. ఇతర బ్రాండ్ల కార్లు గ్యారేజీలో ఉన్నాయి. అప్పట్లో మెగాస్టార్ చిరంజీవికి ఓ ఖరీదైన కార్ ని చరణ్ కానుకగా ఇచ్చాడు.
చరణ్ క్యాప్ పెట్టుకుని మాస్క్ తో ఇలా బయటకు వచ్చారు. పైగా చేతికి గ్లోవ్స్ కూడా పెట్టుకున్న విధానం చూస్తుంటే తనే ఆస్టన్ మార్టిన్ నడుపుకుంటూ రయ్ మని దూసుకెళ్లారనే అర్థమవుతోంది. అన్నట్టు కెరీర్ పరంగా ఆచార్య షెడ్యూల్ కోసం చెర్రీ ఎదురు చూస్తున్నాడు. సేమ్ టైమ్ ఆర్.ఆర్.ఆర్ షూటింగ్ తోనూ బిజీ కానున్నాడు. తీరిక సమయాల్లో ఈ ఖరీదైన కార్ లో షికార్ ని వదిలి పెట్టడం లేదన్నమాట.