Begin typing your search above and press return to search.

బాలీవుడ్ డెబ్యూకి తేదీలు కేటాయించాడు

By:  Tupaki Desk   |   15 Jun 2021 11:30 AM GMT
బాలీవుడ్ డెబ్యూకి తేదీలు కేటాయించాడు
X
కింగ్ నాగార్జున బాలీవుడ్ లో ప‌లు చిత్రాల్లో న‌టించారు. అమితాబ్ తో క‌లిసి ఖుదాగ‌వా అనే చిత్రంలోనూ న‌టించారు. శివ‌- ద్రోహి-అగ్ని వ‌ర్ష‌-లాక్ కార్గిల్ వంటి చిత్రాల్లో నాగార్జున న‌టించారు. ప్ర‌స్తుతం ర‌ణ‌బీర్ క‌పూర్- ఆలియా జంట‌గా న‌టిస్తున్న బ్ర‌హ్మాస్త్ర‌లోనూ ఓ కీల‌క పాత్ర‌ను పోషించారు. ఇక కింగ్ 60 ప్ల‌స్ ఏజ్ లోనూ వ‌రుస సినిమాల‌తో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే.

ఇక ఇదే సంద‌ర్భంలో నాగార్జున వార‌సుడు నాగ‌చైత‌న్య హిందీ డెబ్యూ గురించి ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. అత‌డు మిస్ట‌ర్ ప‌ర్ఫెక్ట్ అమీర్ ఖాన్ న‌టిస్తున్న `లాల్ సింగ్ చద్దా`లో ఓ కీల‌క పాత్ర‌ను పోషిస్తున్నాడు. సెకండ్ వేవ్ రాక‌పోయి ఉంటే చై ఈపాటికే సెట్స్ లో చేరాల్సింది.

ఆల‌స్య‌మైనా తాజా స‌మాచారం మేర‌కు అత‌డు కార్గిల్ షెడ్యూల్ లో జాయిన‌య్యేందుకు సిద్ధ‌మ‌వుతున్నార‌ని తెలిసింది. ప్రస్తుతం చిత్ర‌బృందం ముంబైలో కీలక భాగాన్ని చిత్రీకరిస్తోంది. తదుపరి షెడ్యూల్ కార్గిల్ ప్రాంతంలో కొన‌సాగుతుంది. నాగ చైతన్య కార్గిల్ షెడ్యూల్ లో చేరతారు. చైతూ ఇప్పటికే ప్రాజెక్ట్ కోసం తన తేదీలను కేటాయించాడు. మిస్ట‌ర్ ప‌ర్ఫెక్ట్ అమీర్ ఖాన్ కాంబినేష‌న్ లో చైత‌న్య స‌న్నివేశాల్ని తెర‌కెక్కిస్తున్నారా.. అన్న‌ది తెలియాల్సి ఉంది.