Begin typing your search above and press return to search.

వీడియో టాక్: ఈ గల్లీ బాయ్ కొత్తగా ఉన్నాడే

By:  Tupaki Desk   |   4 Jan 2019 12:37 PM GMT
వీడియో టాక్: ఈ గల్లీ బాయ్ కొత్తగా ఉన్నాడే
X
మన టెంపర్ ని హిందీలో సింబా పేరుతొ రీమేక్ చేసుకుని సూపర్ హిట్ కొట్టేసిన రన్వీర్ సింగ్ ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్నాడు. స్టార్లందరూ డిజాస్టర్లతో బాక్స్ ఆఫీస్ కు షాక్ ఇచ్చిన తరుణంలో తాను ఇయర్ ఎండింగ్ ని వంద కోట్ల సినిమాతో ముగించడం మంచి కిక్ ఇస్తోంది. ఇప్పుడున్న యూత్ హీరోల్లో వెరైటీ రోల్స్ దూసుకుపోతోంది రన్వీరే. దీపికా పదుకునేను పెళ్లాడిన తర్వాత ఇంకా కిక్ వచ్చినట్టు ఉంది. తాజాగా మరో కొత్త సినిమా విడుదలకు రెడీ అవుతోంది. పేరు గల్లీ బాయ్.

ఈ నెల 9న విడుదల కానున్న థియేట్రికల్ ట్రైలర్ కు ప్రీ లుక్ గా ఓ చిన్న సాంగ్ వీడియో కం టీజర్ ను విడుదల చేసింది యూనిట్. ముంబైలోని బాగా ఇరుగ్గా ఉండే స్లమ్ ఏరియాలో ఉంటాడు రన్వీర్. ప్రాంతం ఎలా ఉన్నా జీవితాన్ని జాలీగా గడిపేసే లైఫ్ అతనిది. ముస్లిం యువతీ అయిన హీరోయిన్ అలియా భట్ ని ప్రేమిస్తాడు. లోకల్ గూండాలతో తగాదాలు ఉంటాయి గల్లీ బాయ్ కు.

మొత్తంగా సెటప్ మొత్తం చూస్తుంటే ఆసక్తికరంగా ఉంది. హీరో వ్యక్తిత్వాన్ని అతని ఉద్దేశాలను దేశం మీద ప్రేమను హిప్ హాప్ స్టైల్ లో కంపోజ్ చేసిన పాటను రన్వీర్ సింగ్ స్వయంగా పాడటం విశేషం. సింబాలో పెద్ద మీసంతో మెప్పించిన రన్వీర్ ఇందులో అది లేకుండా ఫుల్ యూత్ లుక్ లోకి వచ్చేసాడు. అలియా భట్ కూడా క్యూట్ గా ఉంది. కథ పూర్తిగా రివీల్ చేయలేదు. జోయా అక్తర్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఫిబ్రవరి 14న విడుదల కానుంది