Begin typing your search above and press return to search.

నా బ్రా కొల‌త అడిగాడుః న‌టి

By:  Tupaki Desk   |   15 April 2021 7:00 AM IST
నా బ్రా కొల‌త అడిగాడుః న‌టి
X
సోష‌ల్ మీడియాలో ఆవారా బ్యాచ్ హ‌ద్దులు మీరుతోంది. వారి చేష్ట‌లు రోజురోజుకూ శృతిమించుతున్నాయి. ఇప్ప‌టికే ప‌లువురు హీరోయిన్లను న‌గ్న చిత్రాలు అడిగిన సంగ‌తి తెలిసిందే. తాజాగా.. హిందీ టీవీ న‌టి సయాంత‌ని ఘోష్ ను బ్రా సైజ్ ఎంత అని అడిగాడ‌ట ఓ ఆక‌తాయి. ఒక ఇంట‌ర్వ్యూ సంద‌ర్భంగా ఇది జ‌రిగింద‌ని తెలిపింది.

దీనిపై ఆమె తాజాగా స్పందించారు. అస‌లు మ‌హిళ‌ల ఛాతి గురించి మ‌గాళ్లు ఎందుకు ప్ర‌త్యేక శ్ర‌ద్ధ చూపిస్తారో త‌న‌కు అర్థం కావ‌ట్లేద‌ని అన్నారు. దేహంలోని అన్ని అవ‌య‌వాల మాదిరిగా.. ఛాతి కూడా ఒక భాగ‌మేన‌ని అన్నారు. త‌న ఛాతి వంక అదే ప‌నిగా చూసిన వారు చాలా మంది ఉన్నార‌ని, వ‌ర్కింగ్ ప్లేస్ లో తాను చాలా సంద‌ర్బాల్లో ఇబ్బంది ఎదుర్కొన్న‌ట్టు చెప్పారు. అయితే.. ఇక‌పై మౌనంగా ఉండొద్ద‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు చెప్పారు. అలా చూసేవాళ్ల‌కు బుద్ధి వ‌చ్చేలా మాట్లాడాల్సిన స‌మ‌యం వ‌చ్చింద‌ని అన్నారు.

ఛాతి మీద ఆడ‌వాళ్లు కూడా అభ‌ద్ర‌తా భావం ఉంద‌న్నారు. అలాంటి వారిని తాను చూశాన‌ని చెప్పారు. కొంద‌రు ఛాతి చిన్న‌గా ఉంద‌ని, మ‌రికొంద‌రు పెద్ద‌గా ఉంద‌ని ఇబ్బంది ప‌డుతుంటార‌ని, అలాంటి వారు క‌నీసం న‌చ్చిన డ్రెస్ కూడా కొనుక్కోలేక‌పోతుంటార‌ని ఆవేద‌న వ్య‌క్తంచేశారు.

మ‌హిళ‌లు, యువ‌తులు ఈ ప‌రిస్థితి నుంచి బ‌య‌ట‌ప‌డాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. ఆడ‌వాళ్ల శ‌రీర తీరుపై అస‌భ్యంగా మాట్లాడే వారికి బుద్ధి చెప్పేలా న‌డుచుకోవాల‌న్నారు. ఈ రోజుల్లో శారీర‌క ఆరోగ్యంక‌న్నా ఎక్కువ‌గా మాన‌సిక ఆరోగ్యం ముఖ్య‌మ‌ని అన్నారు. దాన్ని పెంచుకునేందుకు మ‌హిళ‌లు కృషి చేయాల‌ని అన్నారు.