Begin typing your search above and press return to search.
అశిన్ తొలి వెడ్డింగ్ కార్డ్.. ఆయనకే
By: Tupaki Desk | 11 Jan 2016 3:42 AM GMTఅందాల నాయిక అశిన్ సుదీర్ఘ ప్రేమాయణం ఫలవంతమవుతోంది. తాను వలచిన రాకుమారిడిని పెళ్లాడేసేందుకు ఇక అన్నీ సిద్ధం. రాహుల్ తో ఇప్పటివరకూ సాగించిన డేటింగ్ కి ఫుల్ స్టాప్ పెట్టేసి ఇక పరిణయానికి సిద్ధమైంది. మైక్రోమ్యాక్స్ ఓనర్ రాహుల్ శర్మని వివాహమాడేస్తోంది. ఈనెల 23న ముంబైలో గ్రాండ్ ఈవెంట్ కి ప్లానింగ్ చేసేసింది. వివాహ వేడుకను చాలా సింపుల్ గా తేల్చేసి రిసెప్షన్ ప్లాన్ చేస్తోంది. ముంబైలో అత్యంత గ్రాండ్ గా సాగే ఈ రిసెప్షన్ కి కూడా పరిమితంగానే అతిధుల్ని ఇన్వయిట్ చేస్తోంది. గెస్టుల జాబితా ఇప్పటికే ప్రిపేరైపోయింది. అయితే ఈ అతిధుల్లో స్పెషల్ అతిధి ఎవరని అనుకుంటున్నారు? ఊహించగలరా ? వెరీ సింపుల్.
అసలు తన ప్రేమాయణానికి ముఖ్య కారకుడు అయిన స్టార్ హీరో అక్షయ్ కుమారే అశిన్ పెళ్లికి మొట్టమొదటి అతిధి. అక్షయ్ కుమార్ తన బ్యూయోకి క్లోజ్ ఫ్రెండ్. అక్కీ వల్లనే ఈ ఇద్దరూ కలుసుకున్నారు. అచ్చం అశిన్ నటించిన గజని సినిమా లవ్ స్టోరీలా ఇద్దరిమధ్యా ప్రేమాయణం సాగింది. అక్కీ తన జీవితానికో విలువైన కానుకను ఇచ్చాడు. అందుకే అతడిని ప్రత్యేకించి గుర్తు పెట్టుకని మరీ ఇలా ప్రాధాన్యతనిచ్చింది. వివాహ వేడుక - రిసెప్షన్ కి సంబంధించిన తొలి వెడ్డింగ్ కార్డ్ ని అక్షయ్ కే అందించింది. ఇది ఎంతో సముచితమైన నిర్ణయం. అందాల నాయిక పెళ్లికూతురయ్యే శుభఘడియ రానే వచ్చింది. ఊరంత పందిళ్లు లేకపోయినా అర్బన్ స్టయిల్ లో ఘనంగానే జరగనుంది.