Begin typing your search above and press return to search.

అసిన్‌.. అంత మాటనేసింది ఏంటి...

By:  Tupaki Desk   |   26 Oct 2015 5:00 PM IST
అసిన్‌.. అంత మాటనేసింది ఏంటి...
X
నిజానికి అసిన్‌ గురించి అసలు మీడియా కూడా పట్టించుకోవడం మానేసింది. ఎందుకంటే అమ్మడుకు గత నాలుగైదు సంవత్సరాలుగా సినిమాలూ లేవూ.. అలాగే అమ్మడు ఎక్కడా కనిపించడమూ లేదు. ఈ మధ్యనే ఓ రెండు సినిమాల్లో హీరోయిన్ గా మెరిసినా కూడా.. అవన్నీ ఫ్లాపులే. అయితే అసిన్‌ మాత్రం తన పద్దతి మార్చుకోవట్లేదు. అమ్మడు మీడియాతో ఫ్రెండ్లీగా మాత్రం ఉండదు అంటున్నారు బొంబాయ్‌ మీడియావారు.

నిజానికి నవంబర్ 26న అసిన్‌ పెళ్ళిచేసుకోబోతున్నట్లు వార్తలొచ్చాయి. ఇందుకోసం ఆల్రెడీ ఒక 7 స్టార్‌ హోటల్‌ ను బుక్‌ చేసి.. చివరకు 26న ముహూర్తం కూడా ఫిక్స్‌ చేయించారని తెలిసింది. ఇదే విషయం గురించి క్లారిటీ ఇవ్వమని అడిగితే.. అబ్బే అమ్మడు రెస్పాండ్‌ అయితే ఒట్టు. కాని ఈ న్యూస్‌ ను పేపర్లలో వేసేసి.. టివిల్లో చెప్పేసి.. వెబ్‌ లోకి ఎక్కించేశాక మాత్రం అమ్మడు తాపీగా క్లారిటీ ఇస్తోంది. నా పెళ్ళి డేట్‌ ఎప్పుడో నేనే చెబుతా. మీరు ఆవేశపడి మీకు నచ్చిన ముహూర్తాలు ఫిక్సు చేసుకోకండి.. అంటూ పంచ్‌ వేసింది.

అదేంటి అసిన్‌ అలా అనేశావ్‌?? మీడియా వాళ్ళు ఫోన్లో మెసేజ్‌ లు పెట్టినప్పుడు ఒక రిప్లయ్‌ ఇచ్చుండచ్చుగా. ఇవన్నీ ఒకెత్తయితే.. అమ్మడుకి ఈ సంవత్సరం ఆఖరి వరకు చాలా పనులున్నాయ్‌ అంటోంది. అవన్నీ పూర్తయితేనే పెళ్లి. అబ్బో.. ఫిలిం ఇండస్ర్టీలో అన్ని పనులు ఏమున్నాయ్‌?