Begin typing your search above and press return to search.

ఆత్మహత్య చేసుకున్న ప్రముఖ నటుడు

By:  Tupaki Desk   |   12 Nov 2020 3:30 PM GMT
ఆత్మహత్య చేసుకున్న ప్రముఖ నటుడు
X
ఈ ఏడాది సినిమా పరిశ్రమకు చెందిన ఎంతో మంది ప్రముఖులు ఇప్పటికే కన్నుమూశారు. ఈ ఏడాది చివరకు వచ్చిన తర్వాత కూడా ఇండస్ట్రీకి చెందిన వారు ఒకొక్కరుగా ఈ లోకాన్ని వదిలి వెళ్తున్నారు. కొందరు కరోనాతో మృతి చెందుతుంటే మరి కొందరు అనారోగ్య సమస్యలు ఇంకొందరు ఆత్మహత్య చేసుకుంటున్నారు. బాలీవుడ్‌ చెందిన ప్రముఖ నటుడు అసిఫ్‌ బస్రా ధర్మశాలలోని తన అపార్ట్ మెంట్ లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడం సంచలనంగా మారింది. 53 ఏళ్ల ఈ నటుడు బాలీవుడ్‌ తో పాటు హాలీవుడ్‌ లో కూడా నటించి మెప్పించాడు.

అసిఫ్‌ బస్రా ఆత్మహత్యకు సంబంధించిన వివరాలు ఎవీ బయటకు రాలేదు. ఆయన ఆత్మహత్యకు గల కారణంపై పోలీసులు ఎంక్వౌరీ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేసి ఎంక్వౌరీ చేస్తున్నారు. 1998 నుండి నటుడిగా కొనసాగతున్న ఈయన క్రిస్‌ 3 మరియు బిగ్‌ బ్రదర్‌ వంటి సినిమాలతో స్టార్‌ గా గుర్తింపు దక్కించుకున్నాడు. ఇక హాలీవుడ్‌ సినిమాలు పాతాళ్‌ లోక్‌.. హోస్టేజ్‌.. వో సినిమాల్లో కూడా కనిపించారు.