Begin typing your search above and press return to search.

‘అర్జున్ రెడ్డి’ని చీప్ గా పట్టేశారే..

By:  Tupaki Desk   |   27 Aug 2017 1:41 PM GMT
‘అర్జున్ రెడ్డి’ని చీప్ గా పట్టేశారే..
X
గత రెండు మూడు రోజులుగా టాక్ ఆఫ్ ద టాలీవుడ్ గా మారిన ‘అర్జున్ రెడ్డి’ సినిమా.. కళ్లు చెదిరే వసూళ్లతో దూసుకెళ్తోంది. ఈ చిత్రం తొలి రోజే నాలుగున్నర కోట్ల షేర్ కలెక్ట్ చేసి సంచలనం సృష్టించింది. ఈ ఊపు చూస్తుంటే ఫుల్ రన్లో ఈ చిత్రం రూ.30 కోట్ల షేర్ మార్కు అందుకోగలదని అంచనా వేస్తున్నారు. కాబట్టి ఈ సినిమాను రిలీజ్ చేసిన ఏషియన్ మూవీస్ వాళ్ల పంట పండినట్లే. ‘అర్జున్ రెడ్డి’ సినిమాను వాళ్లు రూ.5.5 కోట్లకే కొనేశారు. కొన్ని ఏరియాలు అమ్మేసి.. కొన్ని ఏరియాలు సొంతంగా రిలీజ్ చేశారు కాబట్టి వీళ్లకు భారీ స్థాయిలోనే లాభాలు వచ్చే అవకాశముంది. పెట్టుబడి మీద మూడు రెట్ల దాకా ఆదాయం గ్యారెంటీ అని భావిస్తున్నారు.

దీన్ని బట్టి చూస్తే ఏషియన్ వాళ్లు ‘అర్జున్ రెడ్డి’ని చాలా చీప్ గా పట్టేసినట్లే అనుకోవాలి. అలాగని ‘అర్జున్ రెడ్డి’ టీం మరీ బాధపడాల్సిన పని కూడా లేదు. ఈ చిత్రానికి దర్శకుడి సోదరడే నిర్మాత. ఈ చిత్రాన్ని రూ.2 కోట్లలోనే పూర్తి చేశారట. అంటే రూ.3.5 కోట్ల లాభానికి అమ్మేశారు. అయినప్పటికీ అది తక్కువ రేటే అయినా.. ఏషియన్ వాళ్లు తీసుకోబట్టే ఈ సినిమాకు హైప్ పెరిగింది. ఈ డీల్ దగ్గర్నుంచే సినిమా వార్తల్లోకి వచ్చింది. ఆ తర్వాత పబ్లిసిటీ విషయంలో.. రిలీజ్ విషయంలో అన్నీ భారీగా ప్లాన్ చేసింది ఏషియన్ సంస్థ. సినిమాను జనాల్లోకి తీసుకెళ్లడంలో వారి పాత్ర కూడా కీలకం. ఈ సినిమా సాధించిన విజయం చిత్ర బృందంలోని అందరి కెరీర్లకూ ఉపయోగపడుతుందనడంలో సందేహం లేదు. కాబట్టి వాళ్లు చీప్ గా సినిమాను ఇచ్చేశామని చింతించాల్సిన పని లేదేమో.