Begin typing your search above and press return to search.
దత్తుతో తారక్ – ఎలా?
By: Tupaki Desk | 14 May 2018 2:04 PM ISTమహానటి సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న వైజయంతి సంస్థ అధినేత అశ్వినిదత్ కొత్త సినిమాల ప్రణాళికలో బిజీగా ఉన్నారు. మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజుతో పాటు కలిసి నిర్మించనున్న భారీ చిత్రం ఈ నెల చివరి వారంలో మొదలుకానుండగా త్వరలోనే జూనియర్ ఎన్టీఆర్ తో తాను చేయబోయే ఒక సినిమాను ప్రకటిస్తాను అని అశ్విని దత్ మహానటి ప్రమోషన్స్ లో ఉన్నప్పుడు మీడియాకు చెప్పడం ఇప్పుడు చర్చకు దారి తీస్తోంది. నిజానికి తారక్ ఇప్పుడు చేస్తున్న త్రివిక్రమ్ సినిమాకు ఎంత లేదన్నా ఆరు నెలల టైం కావాలి. దాని తర్వాత రాజమౌళి మల్టీ స్టారర్ కోసం ఏడాది పైగానే డేట్స్ ని త్యాగం చేయాల్సి ఉంటుంది. అందులోనే ఉన్న మరో హీరో చరణ్ కూడా సరిగ్గా ఇదే ప్లానింగ్ తో బోయపాటి శీను సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అలాంటప్పుడు అశ్విని దత్ ఎన్టీఆర్ తో సినిమా చేసే గ్యాప్ మధ్యలో దొరకడం కష్టమే.
ఒకవేళ ఈ రెండు సినిమాలు అయ్యాక నాదే ఉంటుంది అన్న ఉద్దేశంతో ఆయన అలా అన్నారా అనే క్లారిటీ ఇంకొద్ది రోజులు ఆగితే కాని తెలియదు. తారక్ వివిధ సినిమా వేడుకలకు వస్తున్నాడు కాని మీడియా మైక్ కు పర్సనల్ గా దొరకటం లేదు. అందుకే అడిగి క్లారిటీ తీసుకుందామన్న అవకాశం లేకుండా పోయింది. అశ్వినిదత్ గారు గతంలో తారక్ తో చేసిన కంత్రి అంతంత మాత్రం ఫలితం ఇవ్వగా శక్తి దారుణ పరాజయం అందుకుంది. ఇతర నిర్మాతలను కలుపుకుని తీసిన స్టూడెంట్ నెంబర్ వన్ మాత్రం సూపర్ హిట్ అయ్యింది. మరి ఇప్పుడు అశ్వని దత్ జూనియర్ తో ఏ దర్శకుడిని సెట్ చేస్తాడు అనేది ఆసక్తికరమే. త్వరలోనే ఆ వివరాలు వెల్లడిస్తాను అని చెప్పిన దత్తు గారు చెప్పిన ప్రకారం కొత్త సినిమా ఉంటే కనక రాజమౌళి కంటే ముందు అది చూసే అవకాశం దక్కొచ్చు. దీనికి సంబంధించిన పూర్తి క్లారిటీ రావాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయక తప్పదు.