Begin typing your search above and press return to search.

24ఏళ్ళ కుర్రాడు.. ఇరగదీశాడు

By:  Tupaki Desk   |   19 Sept 2015 5:00 PM IST
24ఏళ్ళ కుర్రాడు.. ఇరగదీశాడు
X
ఇదివరకు సినిమా అంటే అందరూ అందుకోలేని ఒక స్థాయి అంశం. ఒక సినిమాలో నటించాలన్నా, ఒక సినిమాను తెరకెక్కించాలన్నా ఎన్నో వ్యయ ప్రయాసలకు లోనవ్వాల్సివస్తుంది. చిన్న సినిమాల హీరోలు ఎన్నో సినిమాలలో సైడ్ క్యారక్టర్ లు చెయ్యవలిసి వచ్చేది. ఒక మీడియం బడ్జెట్ సినిమాకి డైరెక్టర్ గా పనిచెయ్యాలంటే ఎన్నో సినిమాలకు అసిస్టెంట్ గా చేస్తేగానీ ఛాన్స్ దొరికేదికాదు.అయితే ఇప్పుడు ఈ లెక్కలన్నీ మారాయి. డిజిటల్ మీడియా ఘన ప్రవేశంతో సినిమాలపై పిచ్చి వుంటే వేగంగా వెలుగులోకి వచ్చే అవకాశాలు పెరిగాయి.

ప్రస్తుతం థియేటర్ లలో సందడి చేస్తున్న హర్రర్ మూవీ 'మాయ/ మయూరి' సినిమాను ఒక 24ఏళ్ళ కుర్రాడు డైరెక్ట్ చేశాడంటే నమ్మగలమా?? కానీ అది నిజం. ఐదంకెలు జీతాన్ని - సాఫ్ట్ వేర్ జీవితాన్ని వదులుకుని సినిమాలపై ప్రేమతో షార్ట్ ఫిలిమ్స్ ని వారధిగా మార్చుకున్న అశ్విన్ శర్వనన్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచాడు.

హాలీవుడ్ స్థాయి హర్రర్ సినిమాని తెరకెక్కించి, బిగింపు స్క్రీన్ ప్లేతో సినిమాను తెరకెక్కించిన సినిమాని, దర్శకుడి ప్రతిభను ప్రశంసించకుండా వుండలేం. అశ్విన్ సినిమా ప్రాధమిక సూత్రాలను అవలంబించుకుంటే అతి తక్కువ కాలంలోనే గొప్ప స్థాయికి చేరుకునే లక్షణాలు పుష్కలంగా వున్నాయి. ఈ యువ దర్శకుడి ఖాతాలో మరిన్ని విజయాలు సొంతంకావాలని కోరుకుందాం.